నెట్‌ఫ్లిక్స్‌లో ప్రతివారం ఓ సౌత్ సినిమా స్ట్రీమింగ్ | Netflix Eyes On South Indian Movies | Sakshi
Sakshi News home page

Netflix South Movies: దక్షిణాదిపై నెట్‌ఫ్లిక్స్ భారీ ప్లాన్

Aug 21 2026 7:30 AM | Updated on Aug 21 2026 7:30 AM

Netflix Eyes On South Indian Movies

దక్షిణ భారతీయ సినీ ప్రియులకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ గుడ్ న్యూస్ చెప్పేసింది. సౌత్ ఇండస్ట్రీపై తన పెట్టుబడులని, భాగస్వామ్యాన్ని మరింత పెంచుతూ ఈ ఏడాది మిగిలిన సమయంలో ప్రతివారం ఒక కొత్త తెలుగు లేదా తమిళ లేదా మలయాళ సినిమాని స్ట్రీమింగ్ చేస్తామని చెన్నైలో తాజాగా జరిగిన ఈవెంట్‌లో సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. ఈరోజు(ఆగస్టు 21) ప్యార్ ప్రేమ కళ్యాణం అనే సినిమా నేరుగా ఈ ఓటీటీలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. దీంతో పాటు థియేటర్లలో సందడి చేసిన రామ్ చరణ్ పెద్ది(ఆల్రెడీ స్ట్రీమింగ్), ధనుష్, విజయ్ దేవరకొండ, నాని తదితర హీరోల క్రేజీ ప్రాజెక్టులు నెట్‌ఫ్లిక్స్‌లోకి రానున్నాయని వివరించారు.

కేవలం సినిమాలకే కాకుండా ఓటీటీ ఒరిజినల్స్ కూడా తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. తెలుగులో తొలి ఒరిజినల్ సిరీస్ సూపర్ సుబ్బు, తమిళంలో ద గేమ్‌తో పాటు స్టీఫెన్, తక్షకుడు, లెగసీ తదితర క్రేజీ ప్రాజెక్టులని రూపొందిస్తున్నట్లు తెలిపారు. 2023 నుంచి తెలుగు, తమిళ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 సినిమాల్లో 50 శాతం కంటే ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని, 2025లో ఏకంగా 59 దేశాల్లో దక్షిణాది సినిమాలు టాప్-10 ట్రెండింగ్‌లో చోటు దక్కించుకుని అంతర్జాతీయంగా తమ సత్తా చాటాయని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement