అత్తగారి తరపువారు ఏడ్చారు | Neha Kakkar Says Rohanpreet Singh Was In Tears Ahead Of Their Wedding | Sakshi
Sakshi News home page

అత్తగారి తరపువారు ఏడ్చారు

Jan 12 2021 3:22 PM | Updated on Jan 12 2021 3:22 PM

Neha Kakkar Says Rohanpreet Singh Was In Tears Ahead Of Their Wedding - Sakshi

బాలీవుడ్‌ గాయని, టెలివిజన్‌ పర్సనాలిటీ, ఇండియన్‌ ఐడెల్‌ జడ్జి నేహా కక్కడ్‌ ఇటీవల చండీగడ్‌కు చెందిన గాయకుడు రోహన్‌ప్రీత్‌ సింగ్‌ను పెళ్లి చేసుకుంది. 32  ఏళ్ల ఈ గాయని హృషికేశ్‌ నుంచి ముంబైకి వచ్చి ఎంతో స్ట్రగుల్‌ చేసి గాయనిగా ఇప్పుడు పేరు తెచ్చుకుంది. చండీగడ్‌కు ఏదో కార్యక్రమానికి వెళ్లిన నేహా అక్కడ రోహన్‌ప్రీత్‌ సింగ్‌ను చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంది. రోహన్‌ కూడా గాయకుడే కాని నేహా అంత పేరు లేదు. రెండు రోజుల క్రితం ఇండియన్‌ ఐడల్‌ షోలో వీరిద్దరినీ కూచోబెట్టి పెళ్లి అంపకాలప్పుడు నేహా తరఫువాళ్లు బాగా ఏడ్చారా అని అడిగితే దానికి రోహన్‌ సమాధానం చెప్పాడు.

‘వాళ్లు ఏడ్చారుగాని మా వాళ్లే ఎక్కువ ఏడ్చారు. ఎందుకంటే నా జీవితం అంతా చండీగడ్‌లో గడిచింది. ఇప్పుడు నేహా కోసం ముంబైకి వచ్చేస్తున్నానని మావాళ్లు ఏడ్చారు’ అని చెప్పాడు. ‘నేహా వచ్చి నాకు అన్ని సంతోషాలు ఇచ్చింది. మా ఇంట్లో వాళ్లు నేను పాడుతుంటే నువ్వు పెద్ద పెద్ద చానల్స్‌లో ఎప్పుడు కనపడతావ్‌ అని అడిగేవారు. ఇవాళ నేహా వల్ల ఇంత పెద్ద చానల్‌ (సోనీ)లో కనిపించాను’ అని సంతోషం వ్యక్తం చేస్తుంటే నేహా కన్నీరు మున్నీరు అయ్యింది. నేహా కక్కడ్, రోహన్‌ దుబాయ్‌లో హనీమూన్‌ జరుపుకుని తిరిగి వచ్చాక నేహా ఇండియన్‌ ఐడల్‌ షో జడ్జిగా రొటీన్‌లో పడింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement