500 మంది డ్యాన్సర్లతో నాని 'దసరా' పాట | Nani Dasara Movie Shooting Start Again At Massive Set | Sakshi
Sakshi News home page

Nani Dasara Movie: 500 మంది డ్యాన్సర్లతో నాని 'దసరా' పాట

Published Sat, Jul 2 2022 8:49 AM | Last Updated on Sat, Jul 2 2022 8:52 AM

Nani Dasara Movie Shooting Start Again At Massive Set - Sakshi

Nani Dasara Movie Shooting Start Again At Massive Set: కొంత విరామం తర్వాత నాని ‘దసరా’ షూటింగ్‌ మళ్లీ ఆరంభమైంది. నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం ‘దసరా’. ఈ చిత్రంలో కీర్తీ సురేశ్‌ హీరోయిన్‌. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 

‘‘గోదావరి ఖనిలోని సింగరేణి కోల్‌ మైన్స్‌ దగ్గర ఉన్న ఓ గ్రామం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. నానీని సరికొత్త మాస్‌ లుక్‌లో చూస్తారు. గత షెడ్యూల్‌లో ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తోపాటు ఓ పాటను చిత్రీకరించాం. ‘నాటు నాటు’ ఫేమ్‌ ప్రేమ్‌రక్షిత్‌ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో దాదాపు 500 మంది డ్యాన్సర్లు పాల్గొన్నారు’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. తెలుగు, తమిళ, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ‘దసరా’ చిత్రం రిలీజ్‌ కానుంది. సముద్రఖని, సాయికుమార్, జరీనా వాహబ్‌ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందించగా, విజయ్‌ చాగంటి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

చదవండి: తొలిసారిగా మోహన్‌ బాబు, మంచు లక్ష్మీల కాంబినేషన్‌.. 
నా రిలేషన్‌ గురించి దాచాలనుకోవట్లేదు: శ్రుతి హాసన్‌
పా. రంజిత్ ​డైరెక్షన్‌లో విక్రమ్‌ సినిమా.. త్రీడిలోనూ చిత్రీకరణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement