
Nandamuri Balakrishna Bentley Luxury Car Cost Goes Viral: నందమూరి బాలకృష్ణ బుల్లితెర ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖు తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ‘అన్‌స్టాపబుల్’ పేరుతో వస్తున్న టాక్ షోకు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ షో ప్రారంభ కార్యక్రమంలో ఆహా నిర్వహకుల్లో ఒకరైన అల్లు అరవింద్, బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈ షోకు బాలయ్య వచ్చిన లగ్జరీ కారు ఖరీదు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అయితే సాధారణంగా బాలయ్యకు ఖరీదైన కార్లు అయినా, బైకులు అన్న పెద్దగా ఆసక్తి ఉండదు.
చదవండి: ఆహా ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో: బాలయ్య రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
నిత్యం ఆయన సినిమాలు లేదా రాజకీయాలతో బిజీగా ఉంటారు. ఇక ఖాళీ సమయంలో బసవతారకం హాస్పిటల్ పనులతో బిజీగా ఉంటారు. అలా సాదాసీదాగా ఉండే బాలకృష్ణ ఈ షోకు లగ్జరీ బెంట్లీ కారులో రావడంతో అందరి దృష్టి దానిపై పడింది. దీంతో కోట్లు ఖరీదు చేసే ఈ లగ్జరీ కారును బాలయ్య ఎప్పుడు కొన్నాడా? అని ఆరా తీయగా ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ కారును బాలయ్య బర్త్‌డే సందర్భంగా ఆయన పెద్ద కూతురు బ్రాహ్మణి బహుమతిగా ఇచ్చిందట. దీని ఖరీదు దాదాపు 4 కోట్ల నుంచి 4.5 కోట్లు వరకు ఉంటుందని అంచనా.
చదవండి: విడాకుల అనంతరం దర్శకులకు కొత్త కండిషన్స్ పెడుతోన్న సామ్!
ప్రస్తుతం కూతురు ఇచ్చిన కారులోనే బాలయ్య షికారు చేస్తున్నాడట. ఇక సినిమాల్లో పవర్ ఫుల్ డైలాగ్స్‌తో అదరగొట్టే బాలయ్య బుల్లితెరపై తొలిసారిగా యాంకర్‌గా వస్తుండటంతో నందమూరి అభిమానుల్లో ఆసక్తిగా నెలకొంది. నవంబర్ 4 నుంచి ప్రసారం కానున్న తొలి ఎపిసోడ్‌లో బాలకృష్ణ ఎవరిని ఇంటర్వ్యూ చేయనున్నారు, తొలి గెస్ట్ ఎవరా అని ప్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక అన్ స్టాపబుల్ పేరుతో వస్తున్న ఈ టాక్ షో 12 ఎపిసోడ్లుగా ప్రసారం కానుంది. 12 ఎపిసోడ్‌లకు గాను ఆయన దాదాపు రూ. 5 నుంచి రూ. 6 కోట్ల వరకు అందుకుంటున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరి ఈ షో ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
చదవండి: చాలా విషయాల్లో బైలాస్ మార్చాలనుకుంటున్నా: మంచు విష్ణు