అతనితో స్నేహం చేస్తా: నమ్రతా శిరోద్కర్‌

Namrata Shirodkar Was Asked This Question In Miss India - Sakshi

ముంబై: సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌ మిస్‌ ఇండియా పోటీ చేసిన నాటి ఓ వీడియోను ఆమె సోదరి, నటి శిల్పా శిరోద్కర్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. 1993లో నమ్రతా మిస్‌ ఇండియా కిరీటం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పోటీలో నమ్రత తన సమాధానంతో షో జడ్జీలను మెప్పించారని శిల్పా తన పోస్టులో పేర్కొన్నారు. ఈ వీడియోను బుధవారం శిల్పా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇందులో మాజీ మిస్‌ ఇండియా సంగీత బిజ్లానీ కూడా కనిపించారు. ఈ రౌండ్‌లో ఏ ముగ్గురు తర్వాత రౌండ్‌కు వెళతారని సంగీతను అ‍డగ్గా.. కచ్చితంగా నమ్రత విజయం సాధిస్తుందన్నారు. అంతేగాక తనకు ఇష్టమైన కంటెస్టెంట్‌ కూడా నమ్రత అని ఆమె పేర్కొన్నారు. (చదవండి: అతడు నా అభిమాన హీరో)

ఆ తర్వాత నమ్రతను.. ‘మీరు ఓ ఉదయం లేచేసరికి కౌంట్‌ డ్రాక్యులా(కల్పిత పాత్ర) మీ మంచంపై నిద్రిస్తున్నట్టు కనిపిస్తే ఏం చేస్తారు అని అడగ్గా’.. దానికి నమ్రత.. నేను నిజంగా భయపడాతాను కానీ అప్పుడు అతనితో స్నేహం చేస్తాను’ అంటూ సమాధానం ఇచ్చారు. నమ్రతా హిందీలో ‘కచ్చే ధాగే’, ‘పుకార్’, ‘అస్తిత్వ’, ‘అల్బెలా’, ‘దిల్ విల్ ప్యార్ వయార్’ వంటి హిందీ చిత్రాలలో తన నటనకు నమ్రతా శిరోద్కర్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె కన్నడ, తెలుగు, మలయాళ చిత్రాలలో కూడా నటించారు. 2000 సంవత్సరంలో వచ్చిన ‘వంశీ’ సినిమా సమయంలో మహేష్‌ బాబుతో ప్రేమలో పడ్డారు. అనంతరం వీరిద్దరూ 2005లో కుటుంబ సభ‍్యుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. (చదవండి: ఆవిడంటే నాకు చాలా ఇష్టం: నమ్రత)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top