'నమో' కోసం యంగ్ టీమ్‌ చేసిన ప్రయత్నం సక్సెస్ అవ్వాలి: భీమనేని శ్రీనివాసరావు | Namo Movie Pre Release Event | Sakshi
Sakshi News home page

'నమో' కోసం యంగ్ టీమ్‌ చేసిన ప్రయత్నం సక్సెస్ అవ్వాలి: భీమనేని శ్రీనివాసరావు

Jun 4 2024 7:39 PM | Updated on Jun 4 2024 7:39 PM

Namo Movie Pre Release Event

 స‌ర్వైవ‌ల్ జోన‌ర్‌లో టాలీవుడ్‌లో రాబోతున్న సినిమా 'నమో'. విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి ఇందులో హీరోలు. విస్మయ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఏ.ప్రశాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఆదిత్య రెడ్డి కుందూరు ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే, తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు భీమనేని శ్రీనివాసరావు, బెక్కం వేణుగోపాల్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ మూవీ జూన్ 7న విడుదలకు సిద్దంగా ఉంది.

భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘ఆదిత్య నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఈ చిత్రంతో ఆదిత్య దర్శకుడిగా పరిచయం అవుతుండటం ఆనందంగా ఉంది. అతను ఎంతో కష్టపడతాడు. మంచి టాలెంట్ ఉంది. ఆదిత్య ఈ సినిమాతో తనని తాను నిరూపించుకుంటాడనిపిస్తోంది. సినిమాలోని పాత్రలు కష్టాలు పడుతుంటే.. చూసే ప్రేక్షకులకు ఫన్ వస్తుంటుంది. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ సినిమాలను థియేటర్ వరకు తీసుకు రావడమే గొప్ప విషయం. యంగ్ టీం కలిసి చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలి’ అని అన్నారు.

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘నన్ను పెద్ద సినిమా ఫంక్షన్‌లకు పిలిచినా వెళ్తాను. చిన్న సినిమా ఈవెంట్‌లకు ఆహ్వానించినా వస్తాను. కానీ చిన్న చిత్రాల ప్రమోషన్స్‌కి వస్తే.. వారికి ఎంతో సాయం చేసినట్టుగా అవుతుంది. హీరోయిన్ విస్మయ తెలుగమ్మాయి. ఇప్పటికే నాలుగు సినిమాలు చేసింది. మంచి స్టార్ హీరోయిన్ అయ్యే సత్తా ఉన్న నటి. కొత్త దర్శక, నిర్మాతలు ఇప్పుడు ఎక్కువగా ఇండస్ట్రీలో సినిమాలు తీస్తున్నారు. కథను నమ్మి సినిమాలు తీసే దర్శక నిర్మాతలకు ఎప్పుడూ విజయం చేకూరాలి. ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్న ఆదిత్యకు ఆల్ ది బెస్ట్. విశ్వంత్ మంచి నటుడు. మంచి టాలెంట్ ఉన్న నటుడు. ఆయనకు ఇంకా సరైన బ్రేక్ రాలేదు. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement