ఈసారి పండక్కి..నా సామి రంగ | Nagarjuna First Look From 'Naa Saami Ranga' Out: Film To Be Release In 2024 - Sakshi
Sakshi News home page

ఈసారి పండక్కి..నా సామి రంగ

Published Wed, Aug 30 2023 12:05 AM

Nagarjuna First Look From Naa Saami Ranga Out: Film To Release In 2024 - Sakshi

సంక్రాంతికి ‘నా సామి రంగ’ అంటున్నారు నాగార్జున. ఆయన హీరోగా నటించనున్న కొత్త సినిమాకు ‘నా సామి రంగ’ టైటిల్‌ను ఖరారు చేశారు. కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, పవన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగళవారం (ఆగస్ట్‌ 29) నాగార్జున బర్త్‌ డే. ఈ సందర్భంగా ‘నా సామి రంగ’ను ప్రకటించి, ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేసి, ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ వెల్లడించారు.

‘ఈసారి పండక్కి నా సామి రంగ’ అంటూ ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ వీడియోలో నాగార్జున పేర్కొన్నారు. ఈ సినిమాతో ‘పలాస’ ఫేమ్‌ దర్శకుడు కరుణకుమార్‌ నటుడిగా పరిచయం అవుతున్నారు. ‘‘సంక్రాంతి సీజన్‌లో నాగార్జునగారికి చాలా హిట్‌ ఫిల్మ్స్‌ ఉన్నాయి. వినోదాత్మకంగా సాగే ‘నా సామి రంగ’ సినిమాను సంక్రాంతికి థియేట్రికల్‌ రిలీజ్‌ చేయనున్నాం. బెజవాడ ప్రసన్నకుమార్‌ ఈ సినిమాకు కథ, డైలాగ్స్‌ అందిస్తున్నారు’’ అని చిత్ర యూనిట్‌ వెల్లడించింది.

ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం. కీరవాణి. పవర్‌ఫుల్‌ రోల్‌: ధనుష్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా రూ΄÷ందనున్న సంగతి తెలిసిందే. ఇందులో  రష్మికా మందన్నా హీరోయిన్‌. సోనాలి నారంగ్‌ సమర్పణలో సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మించనున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో నాగార్జున ఓ పవర్‌ఫుల్‌ రోల్‌ చేయనున్నట్లు యూనిట్‌ ప్రకటించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement