తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. డబ్బింగ్ చిత్రాల నిర్మాత, నెల్లూరు డిస్ట్రిబ్యూర్ గుజ్జలపూడి హరి (46) గుండెపోటుతో మరణించారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్‌గా హరి ఎన్నో సినిమాలను పంపిణీ చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసింది ఆయనే!
డబ్బింగ్ సినిమాలు
విశాల్, తమన్నా జంటగా నటించిన ఒక్కడొచ్చాడు చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. విశాల్ తమిళంలో నిర్మించిన పలు సినిమాలను తెలుగులో 'హరి వెంకటేశ్వర పిక్చర్స్' బ్యానర్‌పై విడుదల చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అన్నపూర్ణ స్టూడియోస్, శ్రేష్ఠ మూవీస్‌కు చెందిన పలు చిత్రాలను నెల్లూరులో పంపిణీ చేశారు.
25 ఏళ్లకు పైగా పరిచయం
హరి మరణంపై హీరో నాగార్జున విచారం వ్యక్తం చేశాడు. 'హరి మరణవార్త విని షాకయ్యాను. ఆయన ఇక లేడన్న విషయం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. మా పరిచయం 25 సంవత్సరాలకు పైగా సాగింది. అక్కినేని కుటుంబానికి ఆయన ఒక పిల్లర్‌లా అండగా నిలబడ్డారు. మా జీవితాల్లో ఆయన లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరు. తెలుగు సినీ ఇండస్ట్రీ ఒక మంచి మనిషిని, గొప్ప డిస్ట్రిబ్యూటర్‌ను కోల్పోయింది' అని ట్వీట్ చేశాడు.
Deeply saddened and shocked lby the passing of Gujjalapudi Hari Kumar. Our association goes back over 25 years, A pillar of support for the Akkineni family, his presence will be irreplaceable in our lives.
The Telugu film industry has lost a fine distributor and a wonderful soul.… pic.twitter.com/CcxEEwyLoe— Nagarjuna Akkineni (@iamnagarjuna) May 24, 2026
చదవండి: క్షమాపణలు చెప్పిన రామ్‌చరణ్


