
కొన్ని రోజులుగా తన వందో సినిమా కోసం నాగార్జున కథలు వింటున్నారు. ఈ క్రమంలో నాగార్జున వందో సినిమాకు ఈయనే డైరెక్టర్ అంటూ పలువురి దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఇంకా ఎవరూ ఖరారు కాలేదు. అయితే తమిళ దర్శకుడు ఆర్.ఎ. కార్తీక్ చెప్పిన కథ నాగార్జునకు నచ్చిందని సమాచారం. దీంతో కథకు మరింత మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట కార్తీక్.
ఈ సినిమా ప్రీప్రోడక్షన్ వర్క్స్ అతి త్వరలో పూర్తి స్థాయిలో మొదలవుతాయని, ‘కింగ్ 100 నాటౌట్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తారని టాక్. ఇక నాగార్జునను అభిమానులు ‘కింగ్’ అని పిలుచుకుంటారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన నూరవ చిత్రానికి ‘కింగ్ 100 నాటౌట్’ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారనే వార్త ప్రచారంలో ఉంది. ఇదిలా ఉంటే... రజనీకాంత్ తాజా చిత్రం ‘కూలీ’, ధనుష్ ‘కుబేర’ సినిమాల్లో నాగార్జున లీడ్ రోల్స్ చేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలోని ‘కుబేర’ జూన్ 20న, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలోని ‘కూలీ’ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానున్నాయి.