నాగశౌర్య ‘కృష్ణ వ్రిందా విహారి’ టీజర్‌ చూశారా? | Sakshi
Sakshi News home page

Naga Shaurya's Movie Teaser: ‘కృష్ణ వ్రిందా విహారి’ టీజర్‌ చూశారా?

Published Mon, Mar 28 2022 3:12 PM

Naga Shaurya Krishna Vrinda Vihari Teaser Out - Sakshi

నాగశౌర్య, షిర్లీ సేథియా జంటగా రాధిక కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కృష్ణ వ్రిందా విహారి’.అనీష్‌ ఆర్‌. కృష్ణ దర్శకత్వం  వహించిన ఈ చిత్రాన్ని శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించారు. ఏప్రిల్‌ 22న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్‌ని స్టార్ట్‌ చేసిన చిత్ర యూనిట్‌ తాజాగా ఈ సినిమా టీజర్‌ విడుదల చేసింది.

రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగశౌర్య బ్రాహ్మణ యువకుడిగా నటించారు.  అలనాటి నటి రాధిక ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement