విలువలు ముఖ్యం.. కోట్ల డబ్బును కాదన్న జి.వి. ప్రకాష్ | music director GV Prakash refuses Bigg Company Adds | Sakshi
Sakshi News home page

విలువలు ముఖ్యం.. కోట్ల డబ్బును కాదన్న జి.వి. ప్రకాష్

Apr 26 2026 9:08 AM | Updated on Apr 26 2026 12:33 PM

music director GV Prakash refuses Bigg Company Adds

సినిమా, స్పోర్ట్స్‌ రంగాలకు చెందిన అగ్ర నటులు, గొప్ప క్రీడాకారులు భారీ రెమ్యునరేషన్‌ తీసుకుంటారనే విషయం తెలిసిందే. అయితే, వృత్తిపరంగా తీసుకునేంత రేంజ్‌లో వాణిజ్య ప్రకటనలకు కూడా భారీ మొత్తంలో డబ్బు తీసుకుంటారు. ఇందులో కొందరు మాత్రం  ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అన్న చందంగా దొరికిన ప్రతి బ్రాండ్‌లకు ప్రచారం చేసి బ్యాంక్‌ బ్యాలెన్స్‌ పెంచుకుంటారు. మరికొందరు సమాజ హితం కోరి ప్రజలకు హాని చేసే వస్తువులకు ప్రమోషన్‌ చేయరు. ఇప్పుడు ఇదే కోవలో సంగీత దర్శకుడు  జి. వి. ప్రకాష్ కుమార్ ఉన్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి.

బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల విషయంలో సంగీత దర్శకుడు జి. వి. ప్రకాష్ కుమార్ ఒక బలమైన ప్రకటన చేశారు. భారీ రెమ్యునరేషన్‌ ఇస్తామని ఆఫర్లు వచ్చినప్పటికీ, తాను మద్యం, జూదాన్ని ప్రచారం చేయనని పేర్కొన్నారు. ఈ అంశంలో కొందరు తనను సంప్రదించారని భారీ మొత్తంలో డబ్బు కూడా ఆఫర్‌ చేశారని చెప్పుకొచ్చారు. పలుమార్లు చాలామంది పదేపదే తనను సంప్రదించినప్పటికీ నిరంతరం నిరాకరిస్తున్నానని ఆయన వెల్లడించారు.

తాజాగా ప్రముఖ కంపెనీకి చెందిన ఒక సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్‌ను ప్రచారం చేయడానికి తనకు కోట్లు కూడా ఆఫర్ చేశారని, కానీ అది తన వ్యక్తిగత విలువలకు అనుగుణంగా లేకపోవడంతో దానిని తిరస్కరించానని ప్రకాష్‌ కుమార్‌ తెలిపారు.  కీర్తితో పాటు తమకు సమాజం పట్ల బాధ్యత కూడా ఉండాలని అందుకే వాటికి దూరంగా ఉంటున్నాని అన్నారు. వినోద పరిశ్రమలో ఆర్థిక లాభం కంటే నైతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తున్నందుకు ఆయన వైఖరికి అభిమానులు ప్రశంసలు కురిపించారు.

సంగీత దర్శకుడిగా పనిచేస్తూనే హీరోగా కూడా  జి. వి. ప్రకాష్ రాణిస్తున్నారు. యుగానికి ఒక్కడు, మదరాసు పట్టణం,  ఆకాశం నీ హద్దురా, అమరన్‌, లక్కీ భాస్కర్‌, పరాశక్తి, ఇడ్లీ కొట్టు వంటి చిత్రాలకు ఆయన సంగీతం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement