హాస్పిటల్‌ పాలైన ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ | Music Composer-Singer Bappi Lahiri In Hospital With COVID-19 | Sakshi
Sakshi News home page

'అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వచ్చింది'

Apr 1 2021 3:48 PM | Updated on Feb 16 2022 1:31 PM

Music Composer-Singer Bappi Lahiri In Hospital With COVID-19 - Sakshi

ముంబై: దేశ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ నటులు అమీర్‌ఖాన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, కార్తీక్‌ ఆర్యన్‌ సహా పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ బప్పీలహిరికి సైతం కరోనా సోకింది. ప్రస్తుతం ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన్ని చేర్పించినట్లు బప్పీలహిరి కుమార్తె రెమా లాహిరి తెలిపింది.

'కరోనా నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నా నాన్నకి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ముందు జాగ్రత్తగా ఆయన్ని హాస్పిటల్‌లో చేర్పించాం. మీ అందరి ప్రార్థనలతో నాన్న త్వరగా కోలుకొని ఇంటికి వెళ్తారు' అని పేర్కొంది. కాగా గతనెలలోనే తాను కోవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం ప్రీ- రిజిస్టర్‌ చేసుకున్నట్లు బప్పీలహిరి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ దురదృష్టవశాత్తూ ఈలోపే ఆయన కోవిడ్‌ బారిన పడ్డారు.

దీంతో బప్పీలహిరి త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యవంతులుగా తిరిగా రావాలని ఆకాంక్షిస్తూ ఆయన అభిమానులు సహా పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు. చల్తే చల్తే, డిస్కో డాన్సర్, షరాబి వంటి సినిమాలకు మ్యూజిక్‌ అందించి బప్పీలహరి పాపులర్‌ అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో చివరగా భాఘీ3 సినిమాకు ఆయన సంగీతం అందించారు. తెలుగులోనూ స్టేట్ రౌడీ, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, సింహాసనం వంటి చిత్రాల్లో ఎన్నో సూపర్‌హిట్‌ పాటలను అందించారు. 

చదవండి : ఫన్నీ వీడియో: ఆ నటుడికి కరోనా గురించి ముందే తెలుసు!
అమితాబ్‌ సినిమా విడుదల మళ్లీ వాయిదా, కారణం ఇదే

   
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement