‘మంచి రోజులు వచ్చాయి’ లిరికల్ సాంగ్ వచ్చేసింది..

యువ హీరో సంతోష్ శోభన్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమా రూపొందింది. ఇందులో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తోంది. వి.సెల్యులాయిడ్, ఎస్.కె.ఎన్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ మూవీ నుంచి తాజాగా లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. సాయిధరమ్ తేజ్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన ఈ సాంగ్ ‘సో సోగా ఉన్నాననీ .. సో స్పెషలే చేశావులే' అంటూ సాగుతోంది.
Here's foot tapping melody #SoSoGa song frm #ManchiRojulochaie launched by @IamSaiDharamTejhttps://t.co/G8yIKanZyK
🎙️@sidsriram
🖊️@kk_lyricist
🎹@anuprubens@DirectorMaruthi @santoshshobhan @Mehreenpirzada @vcelluloidsoffl @SKNonline @UVConcepts_ @massmoviemakers @adityamusic pic.twitter.com/ZexQmVfhYa— BA Raju's Team (@baraju_SuperHit) August 16, 2021
అనూప్ రూబెన్స్ సంగీతం, కేకే సాహిత్యం, సిద్ శ్రీరామ్ అలాపన ఈ పాటకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యూత్‌ను ఆకట్టుకునే బీట్‌తో అనూప్ బాణీ కట్టిన ఈ పాట ‘తనువులు వేరైనా మన ఊపిరి ఒకటే .. ఊహలు ఒకటే . దారులు ఒకటే’ అంటూ సాగింది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు