మళ్లీ షురూ | Sakshi
Sakshi News home page

మళ్లీ షురూ

Published Fri, May 24 2024 12:03 AM

Megastar Chiranjeevi Vishwambhara Movie latest schedule

కొంత గ్యాప్‌ తర్వాత మళ్లీ ‘విశ్వంభర’ సెట్స్‌కు వెళ్లారు చిరంజీవి. ఆయన హీరోగా నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలోని ఇంట్రవెల్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ని హైదరాబాద్‌లో చిత్రీకరించారు. ఈ భారీ షెడ్యూల్‌ తర్వాత చిరంజీవి ఈ సినిమా చిత్రీకరణ నుంచి చిన్న విరామం తీసుకున్నారు.

కాగా మళ్లీ హైదరాబాద్‌లోనే ఈ సినిమా తాజా షెడ్యూల్‌ షురూ అయింది. చిరంజీవి పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్‌ చేశారట దర్శకుడు వశిష్ఠ. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement