
నాగబాబు కాకినాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇది చాలా బాధాకరమైన సంఘటన. కొద్ది రోజుల క్రితమే నేను అతడితో మాట్లాడాను..
మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని యర్రా నాగబాబు కరోనాతో కన్నుమూశారు. మెగాస్టార్ ఐ బ్యాంక్ స్ఫూర్తితో కోనసీమ ఐ బ్యాంక్‌ను ప్రారంభించిన ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడన్న వార్త తెలిసి చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు. ఓ మంచి మనిషిని కోల్పోయానని దిగులు చెందారు.
'యర్రా నాగబాబు నా వీరాభిమాని. నా పిలుపు మేరకు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసి గర్వకారణంగా నిలిచాడు. మా ఐ బ్యాంక్‌ను ఆదర్శంగా తీసుకుని కోనసీమ ఐ బ్యాంక్ ఏర్పాటు చేశాడు. తద్వారా చూపు లేని ఎంతోమందికి కంటిచూపును ప్రసాదించాడు. అలాంటి యర్రా నాగబాబు కాకినాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడం చాలా బాధాకరం. కొద్ది రోజుల క్రితమే నేను అతడితో సంభాషించినప్పుడు ఎంతో భరోసాగా మాట్లాడాడు. కానీ దురదృష్టవశాత్తూ అతడిని పోగొట్టుకున్నాం. అతడి కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. సారీ నాగబాబు, మిస్ యూ' అని చిరు తీవ్ర సంతాపం ప్రకటించారు.
చదవండి: Pavala Syamala: పావలా శ్యామలకు మెగాస్టార్ చిరంజీవి సాయం
Jr NTR: తారక్‌కి `ఆవారా జిందగి’ టీమ్ డిఫరెంట్ విషెస్..వీడియో వైరల్