ఎన్టీఆర్‌కి `ఆవారా జింద‌గి’ టీమ్‌ డిఫరెంట్‌ విషెస్‌..వీడియో వైరల్‌ | Sakshi
Sakshi News home page

Jr NTR: తారక్‌కి `ఆవారా జింద‌గి’ టీమ్‌ డిఫరెంట్‌ విషెస్‌..వీడియో వైరల్‌

Published Thu, May 20 2021 4:23 PM

Watch: Jr NTR Special Animation Birthday Video By Awara Zindagi Team Goes Viral - Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ 38వ పుట్టిన రోజు నేడు(మే 20). ఈ సందర్భంగా అభిమానులతో పాటు పలువురు సీనీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఎన్టీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే `ఆవారా జింద‌గి`టీమ్‌ మాత్రం ఎన్టీఆర్‌‌కి బర్త్ డే విషెస్ చెప్పడం కోసం డిఫరెంట్ ప్లాన్ చేసింది. యానిమేష‌న్ వీడియోతో తారక్‌కి బ‌ర్త్ డే విషెస్ తెలిపింది.

గ‌తంలో సాయి రామ్ శంక‌ర్‌, శ‌ర‌త్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో `నేనొకర‌కం` చిత్రాన్ని నిర్మించిన విభ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ తాజాగా `ఆవారా జింద‌గి` చిత్రాన్ని నిర్మిస్తోంది. శ్రీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో బి.మ‌ధుసూద‌న్ రెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీహ‌న్‌, అనుప‌మ్‌, లంబు మ‌రియు షాయాజీ షిండే ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.  చాలా వర‌కు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓ డిఫ‌రెంట్ క‌థాంశంతో తెర‌కెక్కుతోంది.  

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ...`` ఈ రోజు పుట్టిన రోజు జ‌రుపుకుంటోన్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గారికి  మా ` ఆవారా జింద‌గి` టీమ్ త‌ర‌పున యానిమేష‌న్ వీడియోతో బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేయ‌డం చాలా ఆనందంగా ఉంది. ప్ర‌స్తుతం దీనికి యూట్యూబ్ లో, సోష‌ల్ మీడియాలో మంచి స్పంద‌న వ‌స్తోంది`. త్వ‌ర‌లో మా సినిమాకు సంబంధించిన  మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డిస్తాం’అన్నారు.

Advertisement
 
Advertisement