
దివంగత ప్రముఖ హీరోయిన్ మీనాకుమారి జీవితం ఆధారంగా ‘కమల్ ఔర్ మీనా’ సినిమా తెరకెక్కనుంది. బుధవారం ఈ సినిమా అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ‘కమల్ ఔర్ మీనా’ సినిమా మీనా కుమారి పూర్తిస్థాయి బయోపిక్ కాదని బాలీవుడ్ సమాచారం. దివంగత ప్రముఖ దర్శకుడు కమల్ అమ్రోహీ (మీనాకుమారి భర్త)తో మీనా పరిచయం,
కమల్–మీనల ప్రేమ, పెళ్లి సంగతులు, వారి కాంబినేషన్ లో వచ్చిన హిట్ ఫిల్మ్ ‘΄ాకీజా’ (1972) విశేషాలతో ఈ చిత్రం ఉంటుందట. ‘మహారాజ్’ సినిమా ఫేమ్ సిద్ధార్థ్ పి.మల్హోత్రా ఈ సినిమాకు దర్శకుడు. బిలాల్ అమ్రోహీ (కమల్ అమ్రోహీæ మనవడు), రోహన్ దీప్ సింగ్, సారేగమ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ్ర΄ారంభమై, 2026లో రిలీజ్ కానుంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు.