డైరెక్టర్‌ ముద్దుపై తొలిసారి రియాక్ట్‌ అయిన మన్నారా చోప్రా | Actress Mannara Chopra Responds On Director AS Ravi Kumar - Sakshi
Sakshi News home page

Mannara Chopra: డైరెక్టర్‌ ముద్దుపై తొలిసారి రియాక్ట్‌ అయిన మన్నారా చోప్రా

Sep 2 2023 9:51 AM | Updated on Sep 2 2023 10:11 AM

Mannara Chopra Response On Director As Ravi Kumar - Sakshi

హీరోయిన్‌ మన్నారా చోప్రాకు టాలీవుడ్‌ డైరెక్టర్‌ ఏఎస్ రవికుమార్  మీడియా సమావేశంలో ముద్దు పెట్టడం.. ఆ వీడియో వైరల్‌ కావడంతో పాటు ఆయన భారీగా ట్రోలింగ్‌కు కూడా గురైయారు. ఇదే విషయంపై ఆయన ఇప్పటికే స్పందించారు. 'హీరోయిన్‌ మన్నారా చోప్రాకు, నాకు లేని నొప్పి మీకెందుకు' అంటూ మరోసారి చిల్లర కామెంట్లు చేసిన విషయం తెలిసిందే..

(ఇదీ చదవండి: వెబ్‌సైట్స్‌ నుంచి సలార్‌ తొలగింపు.. డైనోసార్‌పై భారీ ఎఫెక్ట్‌)

తాజాగ ఒక యూట్యూబ్‌ ఛానల్‌కు  హీరోయిన్‌ మన్నారా చోప్రా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ విషయంపై ఆమె తొలిసారి స్పందించింది. ఆ సందర్భంలో డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ తప్పుగా అలా చేసి ఉంటారని తాను అనుకోలేదని ఆమె చెప్పుకొచ్చింది. మొదటి నుంచి తనను  ఆయన బేటీ బేటీ అంటూ పిలిచే వారని చెప్పింది. అంతే కాకుండా ఆమెను సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఎన్నోసార్లు ఆయన మెచ్చుకున్నారని తెలిపింది.

రాజ్ తరుణ్ హీరోగా 'తిరగబడరా సామీ' సినిమాలో తన పాత్రే లీడ్ హీరోయిన్‌లా ఉంటుందని ఆయన కితాబు ఇచ్చినట్లు మన్నారా చెప్పుకొచ్చింది.  అంతేకాకుండా ఆయన ముద్దు పెట్టిన తర్వాత తాను వెళ్లిపోగానే అసలు అక్కడ ఏం జరుగుతోందో కూడా అర్థం కాలేదని తెలిపింది. ఈ వీడియోలో తన రియాక్షన్ చూస్తే ఎవరికైనా అర్ధం అవుతుందని చెప్పింది. తనకు ఇలా జరగడం ఇదే తొలిసారి అంటూ   డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ ప్రవర్తనను తప్పుగా అర్థం చేసుకోలేదని మన్నార చోప్రా  వెల్లడించింది.

బాలకృష్ణతో 'వీరభద్ర', గోపీచంద్‌తో 'యజ్ఞం', సాయిధరమ్ తేజ్‌తో 'పిల్లా నువ్వు లేని జీవితం' తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఏఎస్ రవికుమార్.. ఇప్పుడు రాజ్ తరుణ్ హీరోగా 'తిరగబడరా సామీ' సినిమా తీశాడు. ఇందులో హీరోయిన్ మన్నారా చోప్రా.. ఓ కీలక పాత్రలో నటించింది. 

(ఇదీ చదవండి: సమంత - విజయ్‌ల మధ్య లిప్‌లాక్‌ సీన్స్‌ అవసరమా..?)

Advertisement
 
Advertisement
Advertisement