హీరోల కోరికలు తీర్చలేదని, సినిమా చాన్స్‌ ఇవ్వలేదు: బోల్డ్‌ బ్యూటీ

Mallika Sherawat Revealed Shocking Reasons Why She Got Fired From Movies - Sakshi

Mallika Sherawat: హాలీవుడ్‌ నుంచి మొదలు టాలీవుడ్‌ వరకు సినీ ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా క్యాస్టింగ్‌ కౌచ్‌, మీటూ అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమలో మహిళలకు లైంగిక వేధింపులు తప్పవని.. ఆయా నిర్మాతలు, దర్శకులతో మానసికంగా ఇబ్బంది పెట్టారని పలువురు తారలు బహిరంగా వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయంపై మీటూ పేరుతో పెద్ద ఉద్యమమే జరిగింది. ఇప్పటికీ పలువురు తారలు క్యాస్టింగ్ కౌచ్ గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల  ఓ జాతీయ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లైంగిక వేధింపులు అనే అంశంపై స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేసింది బోల్డ్‌ బ్యూటీ మల్లిక షెరావత్‌.

‘ఖ్వాహిష్‌’(2003)తో వెలుగులోకి వచ్చిన మల్లికా శెరావత్‌.. ఆ తర్వాత విడుదలైన ‘మర్డర్‌’(2004) సినిమాతో బోల్డ్‌ నటిగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. అయితే  తెరవెనుక హీరోలతో సన్నిహితంగా ఉండకపోవడం వల్ల చాలా సినిమాలకు దూరమయ్యానని, తన టాలెంట్‌ తగిన అవకాశం ఇండస్ట్రీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది మల్లిక.

కోరికలు తీర్చలేదని కొందరు హీరోలు తనకు అవకాశాలు రాకుండా చేశారని సంచలన ఆరోపణలు చేసింది. తన కెరీర్‌ ఆరంభంలో ఇండస్ట్రీలో చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది. అప్పట్లో నటిగా నిలదొక్కుకోవాలంటే.. హీరోలతో గడపడం తప్పనిసరి అన్నట్లుగా ఉండేదని చెప్పింది. ‘కెమెరా ముందు పొట్టి దుస్తులు ధరించి, ముద్దులు ఇచ్చే నువ్వు.. నిజ జీవితంలో ఎందుకు కుదరని చెబుతున్నావ్‌’ అని చాలా మంది అడిగేవారని మల్లిక చెప్పుకొచ్చింది. ఇప్పటికి అక్కడక్కడ మహిళా నటులు వేధింపులకు గురవుతూనే ఉన్నారని మల్లిక పేర్కొంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top