మలయాళ నటుడు అనిల్‌ మురళీ హఠాన్మరణం

Actor Anil Murali Last Breath In Kochi Hospital At 56- Sakshi

కొచ్చి(కేరళ): మ‌ల‌యాళ న‌టుడు అనిల్ ముర‌ళీ(56) గురువారం క‌న్నుమూశారు. కొద్ది రోజులుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన హఠన్మారణం తమిళ, తెలుగు పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తమిళ నటులు టోవినో థామస్, పృథ్వీరాజ్ సుకుమారన్ సహా పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఆయనకు భార్య సుమ, ఇద్దరూ పిల్లలు ఉన్నారు. (చదవండి: సీనియర్‌ నిర్మాత సత్యనారాయణ కన్నుమూత)

అనిల్‌ మొరళీ మొదట 1993లో ‘కన్యాకుమారియిల్‌ ఒరు కవిత’ అనే సినిమాతో తమిళ పరిశ్రమలో ఆరంగేట్రం చేశారు. ఆ తర్వాతి తెలుగు, కన్నడ సినిమాల్లో కూడా నటించారు. తెలుగులో నాని హీట్‌ సినిమా ‘జెండాపై క‌పిరాజు’, ’రంగేలీ కాశీ’లో నటించిన ఆయనకు తమిళంలో నటించిన ‘అవ‌తారం’, ‘రాక్ అండ్ రోల్’‌, ‘బాడీగార్డ్’, ‘సిటీ ఆఫ్ గాడ్’‌, ‘బ్ర‌ద‌ర్స్ డే’ చిత్రాల్లోని పాత్ర‌లు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే ఆయన సినమాల్లోకి రాకుముందు పలు సీరియల్లో కూడా నటించారు. ఆహా డిజటల్‌ ప్లాట్‌ఫాంలో వస్తున్న ‘ఫొరోన్సిక్‌’ ఆయన చివరి చిత్రం. ఈ సినిమా రేపు(శుక్రవారం) విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top