Maduri Dixit: అప్పట్లో సంచలనమైన మాధురీ లిప్‌లాక్‌, అత్యంత కాస్ట్లీ కిస్‌ ఇదేనట!

Madhuri Dixit Had Taken 1Cr Remuneration to do LipLock in Dayavan Movie - Sakshi

ప్రస్తుత సినిమాల్లో హీరోహీరోయిన్ల మధ్య ఇంటిమేట్‌, లిప్‌ లాక్‌ సీన్స్‌ సాధారణం అయిపోయాయి. కానీ 80, 90లో మాత్రం ఇలాంటి సన్నివేశం అంటే సంచలనం. హీరోహీరోయిన్ల మధ్య ఇలాంటి సన్నివేశాలు ఉంటే చాలు దానిపై విపరీతమైన చర్చ జరిగేది. ఎక్కడికి వెళ్లిన ఆ నటీనటులకు దీనిపై ప్రశ్నలు ఎదురవుతూనే ఉండేవి. టీవీల్లో, వార్తల్లో ఎక్కడ చూసిన దీనిపైనే రచ్చ. అలా ఇప్పటికీ తాను చేసిన లిప్‌లాక్‌ సీన్‌పై ప్రశ్నలకు ఎదుర్కొంటూనే ఉంటుంది అలనాటి బ్యూటీ క్వీన్‌, సీనియర్‌ హీరోయిన్‌ మాధురీ ధీక్షిత్‌. 

చదవండి: అదితిపై మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు! రెండో పెళ్లిపై ఏమన్నాడంటే..

అప్పటికే ఆమె స్టార్‌ హీరోయిన్‌, కానీ అవసరం లేకున్నా ఓ సినిమాలో హీరోతో డీప్‌ లిప్‌లాక్‌ సీన్‌ చేసి వార్తల్లోకి ఎక్కింది. అప్పుట్లో దీనిపై పెద్ద రచ్చే జరిగిందట. అసలు మాధురీ ఆ సన్నివేశం ఎందుకు చేసింది? తనకు అంత అవసరం ఏమొచ్చిందని అంతా చర్చించుకున్నారట. అయితే ఈ సీన్‌ కోసం మాధురీ కోటి రూపాయల పారితోషికం తీసుకున్న అంశం అప్పట్లో బచర్చనీయాంశమైంది. అంతేకాదు అంత్యంత విలువైన ముద్దు ఏదంటే మాధురిది అనేంతగా ట్రోల్స్‌ కూడా ఎదుర్కొంది. డబ్బు కోసం ఇంత దిగజారాలా! అని ఫ్యాన్స్‌ సైతం ఆమెను విమర్శించారట. ఇక అసలు విషయానికొస్తే.. బాలీవుడ్‌ దర్శకుడు ఫిరోజ్ ఖాన్ డైరెక్షన్‌లో 1988లో విడుదలైన ‘దయావన్’ చిత్రంలో వినోద్‌ ఖన్నా-మాధురీ దీక్షిత్‌లు హీరోహీరోయిన్లుగా నటించారు.

చదవండి: లవ్‌టుడే హీరోపై రజనీకాంత్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం! ట్వీట్‌కి లైక్‌ కొడతావా? అంటూ ఫైర్‌

ఇందులో అవసరం లేకున్నా హీరోహీరోయిన్ల మధ్య ఇంటిమేట్‌ సీన్‌తో పాటు లిప్‌కిస్‌ పెట్టారట. అయితే మొదట మాధురీ చేయనని చెప్పడంతో​ దర్శక-నిర్మాతలు ఆమెకు కోటీ రూపాయలు ఆఫర్‌ చేశారట. దీంతో ఆమె అయిష్టంగానే ఒకే చేప్పిందని సమాచారం. ఇక రీసెంట్‌గా ఓ మూవీ ఈవెంట్‌లో మీడియా నుంచి మాధురీకి ఈ లిప్‌కిస్‌పై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నేను ఆ సన్నివేశంలో నటించాల్సి ఉండకూడదు. ఇంపార్టెంట్ కాకపోయినా సరే ఆ సీన్ పెట్టారనిపిస్తుంది. నేను దానికి నో చెప్పి ఉండాల్సింది’ అని వివరణ ఇచ్చింది. దీంతో 35 ఏళ్ల నాటి ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top