తెలుగు సినిమాలపై బాలీవుడ్ కన్ను.. స్పెషల్ వీడియో

ఒకప్పుడు తెలుగులో మిగతా భాష చిత్రాలు రీమేక్ లేదా డబ్ అవ్వడం జరిగేది. ఇతర పరిశ్రమలు మన తెలుగు సినిమాలను రీమేక్ చేసేందుకు అంతగా ఆసక్తి చూపేవే కాదు. ముఖ్యంగా బాలీవుడ్. హిందీలో మన సినిమాలకు పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు అంత మారిపోయింది. బాహుబలి సినిమా తర్వాత తెలుగు భాష చిత్రాల క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మన సినిమాలు బి-టౌన్‌లో భారీ స్థాయిలో మార్కెట్ చేయడంతో బాలీవుడ్ వరుస పెట్టి మన సినిమాలను హిందీలో రీమేక్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తోంది. ఇప్పటికే జెర్సీ రీమేక్ హక్కులను సొంతంగా చేసుకున్న బి-టౌన్ మరిన్ని చిత్రాలను కూడా రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తోందట. మరీ రీమేక్ కోసం బాలీవుడ్ కన్నేసిన మన తెలుగు సినిమావో ఓ లుక్కేద్దాం.