యంగ్‌ డైరెక్టర్‌కు ఛాన్స్‌ ఇచ్చిన ధనుష్‌

Kollywood Star Hero Dhanush Signs Another Telugu Film? - Sakshi

విభిన్నమైన పాత్రలతో దూసుకుపోతున్న హీరో ధనుష్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్‌ ఉంది. ఈ నేపథ్యంలో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమమాకు ధనుష్‌ ఇప్పటికే సైన్‌ చేశాడు.  త్రిభాష చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాను స్వీసీఎల్ఎల్‌పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. తమిళనాడు రాజకీయాలతో ముడిపడిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం.

పొలిటికల్‌ టచ్‌తో సినిమా ఉండనుందని తెలుస్తోంది. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. ఇక ధనుష్‌ నటిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావడంతో ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక శేఖర్‌ కమ్ముల సినిమా లైన్‌లో ఉండగానే ధనుష్‌ మరో తెలుగు సినిమాకు సైన్‌చేసినట్లు తెలుస్తోంది. ఓ యంగ్‌ డైరెక్టర్‌కు ధనుష్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా ఓ బడా నిర్మాణ సంస్థ ఈ మూవీని పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. 

చదవండి : పొలిటికల్‌ టచ్‌ : అప్పుడు రానా.. ఇప్పుడు ధనుష్‌
అప్పటి నుంచి ఆల్కహాల్‌ మానేశా : హీరో శింబు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top