మరో హిట్ కాంబో.. ఈ సారి భారీ ప్రాజెక్ట్..! | Kollywood hero Suriya works with again T J Gnanavel under Hombale films | Sakshi
Sakshi News home page

Suriya: మరో హిట్ కాంబో.. బిగ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్..!

Jun 29 2026 6:06 PM | Updated on Jun 29 2026 6:16 PM

Kollywood hero Suriya works with again T J Gnanavel under Hombale films

ఈ ఏడాది కరుప్పుతో సూపర్ హిట్ కొట్టిన సూర్య ఫుల్ జోష్ మీదున్నారు. వరుస పెట్టి సినిమాలు తీస్తూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా విశ్వనాథ్ అండ్ సన్స్ అనే మూవీ ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ సినిమా ఆగస్టులో థియేటర్లలో సందడి చేయనుంది.

అంతలోనే మరో భారీ ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యారు కోలీవుడ్ స్టార్ హీరో. భారీ చిత్రాలు నిర్మించే హోంబలే ఫిల్మ్స్‌తో జతకట్టారు. ఈ సందర్భంగా సూర్యకు ఆహ్వానం పలుకుతూ హోంబలే ఫిల్మ్స్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌కు జై భీమ్ డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సూపర్ హిట్ కాంబో మరోసారి రిపీట్ కావడంతో అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ చిత్రాన్ని పవర్‌ఫుల్ యాక్షన్‌ డ్రామాగా  తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ సినిమాలో సూర్య సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా కనిపించనుంది. హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌లో విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ జూన్ 29న పూజా కార్యక్రమాలతో మొదలుకానుంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement