బిగ్‌బాస్‌: గెలవకపోయినా రూ.2.8 కోట్లు! | Know About Total Earnings Of Bigg Boss 14 Contestant Aly Goni | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: వైల్డ్‌కార్డ్‌ కంటెస్టెంట్‌కు కోట్లల్లో పారితోషికం

Feb 19 2021 12:28 PM | Updated on Feb 19 2021 2:03 PM

Know About Total Earnings Of Bigg Boss 14 Contestant Aly Goni - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌ కొందరికి విలాసవంతమైన జైలులా అనిపిస్తుంది. మరికొందరికి అభిమానులకు మరింత చేరువయ్యే సాధనమనిపిస్తుంది. ఏదేమైనా ఇక్కడ అడుగు పెట్టే కంటెస్టెంట్లకు పాపులారిటీకి పాపులారిటీ, డబ్బుకు డబ్బు రెండూ దొరకుతాయి. అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నమాట!

మలయాళంలో ఈ మధ్యే బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ ప్రారంభమైంది. దీనికి మోహన్‌లాల్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. తెలుగులో కింగ్‌ నాగార్జున ఐదో సీజన్‌కు సన్నాహాలు చేస్తున్నాడు. అటు హిందీలో భాయ్‌జాన్‌ సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 14వ సీజన్‌ ముగింపుకు చేరుకుంది. అయితే ఈ సీజన్‌లో అలీ గోనీ కళ్లు చెదిరే పారితోషికాన్ని అందుకుంటున్నాడట. పార్టిసిపెంట్లు అందరి కన్నా బిగ్‌బాస్‌ యాజమాన్యం ఇతడికే ఎక్కువ డబ్బులు చెల్లించుకుంటోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం అలీ గోనీ వారానికి రూ.16 లక్షలు అందుకుంటున్నాడట. వైల్డ్‌కార్డ్‌ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన అతడు ఈ సీజన్‌ మొత్తానికి గానూ రూ.2.8 కోట్లు తీసుకున్నాడట. ఇది బిగ్‌బాస్‌ ప్రైజ్‌మనీ (రూ.50 లక్షలు)కి ఐదింతలు. ఇక రుబీనా దిలైక్‌ 19 వారాలకుగానూ 95 లక్షలు తీసుకోగా, రాహుల్‌ వాద్య(18 వారాలకు) 18 లక్షలు, నిక్కీ తంబోళి(18 వారాలు) 21.6 లక్షలు, రాఖీ సావంత్‌(10 వారాలు) 25 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఏరోజుకారోజు మరింత ఆసక్తిగా సాగిన ఈ సీజన్‌ గ్రాండ్‌ ఫినాలే ఫిబ్రవరి 21న జరగనుంది.

చదవండి: అభిజీత్‌ను దాటేసిన అఖిల్‌..

యువ నటుడితో నవ్య నవేలీ ప్రేమ!: స్పందించిన నటుడు

Advertisement
 
Advertisement
Advertisement