
వీడియో ఆల్బమ్‌ను రూపొందించడంలో ఉన్న కష్టం తనకు తెలుసని క్రితిక ఉదయనిధి అన్నారు. సోనీ మ్యూజిక్ సమర్పణలో మొదలియార్ బ్రదర్స్ ఫిలిం పతాకంపై మధు చరణ్ రూపొందించిన ఆల్బమ్ ఇన్‌స్టా ఇన్‌సోట్‌గ్రామ్. నక్ష చరణ్ ఆలపించి నృత్య దర్శకుడు శాండీతో కలిసి నటించారు. లియో సంగీతాన్ని అందించారు.
కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ ఆల్బం ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం చెన్నైలో జరిగింది. క్రితిక ఉదయనిధి, నటుడు అరవిందస్వామి, డాక్టర్ కమలా సెల్వరాజ్ ముఖ్యఅతిథులుగా పాల్గొని ఆల్బమ్‌ను ఆవిష్కరించారు. స్త్రీ శక్తిని ఆవిష్కరించే కలర్‌ఫుల్ ఆల్బమ్‌గా ఇది ఉంటుందని దర్శకుడు తెలిపారు.