సెట్స్‌లో నా సామిరంగ  | Sakshi
Sakshi News home page

సెట్స్‌లో నా సామిరంగ 

Published Fri, Dec 22 2023 1:49 AM

King Nagarjuna Akkineni Naa Saami Ranga Tile Song Shoot In A Huge Set - Sakshi

నా సామిరంగ... డ్యాన్స్‌ అంటూ సెట్స్‌లో రెచ్చిపోతున్నారు నాగార్జున, ‘అల్లరి’ నరేశ్, రాజ్‌ తరుణ్‌. కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ, నాగార్జున హీరోగా నటిస్తున్న యాక్షన్‌ ఫిల్మ్‌ ‘నా సామిరంగ’. ‘అల్లరి’ నరేశ్, రాజ్‌ తరుణ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

పవన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఓ సెట్‌లో నాగార్జున, ‘అల్లరి’ నరేశ్, రాజ్‌ తరుణ్‌లతో పాటు 300మంది డ్యాన్సర్స్‌ పాల్గొంటుండగా, టైటిల్‌ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. చిత్ర సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి స్వరపరచిన ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించారు.
 

Advertisement
 
Advertisement