ఆకట్టుకుంటోన్న ‘కేసీపీడీ’ వీడియో సాంగ్

KCPD Video Song Out From Atharva - Sakshi

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌లు ఎప్పుడూ ప్రేక్షకులను కట్టిపడేస్తూనే ఉంటాయి. అయితే ఈ క్రైమ్ థ్రిల్లర్‌లను క్లూస్ టీం కోణంలోంచి చూపించేందుకు 'అథర్వ' అనే చిత్రం రాబోతోంది. అన్ని రకాల ఎమోషన్స్‌ కలిపి తీసిన ఈ చిత్రం నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందింది. ఈ సినిమాలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి మహేష్ రెడ్డి దర్శకత్వం వహించగా సుభాష్ నూతలపాటి నిర్మించారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు.

ఇప్పటికే చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలు, పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా మరో మంచి బీట్ ఉన్న వీడియో పాటను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. కేసీపీడీ అంటూ సాగే ఈ పాట అదిరిపోయింది. ఈ వీడియో సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఊరి వాతావరణంలో ఎంతో సహజంగా ఈ పాటను తెరకెక్కించారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ, శ్రీ చరణ్ పాకాల బాణీ, గాత్రం ఈ పాటను వినసొంపుగా, చూడముచ్చటగా మార్చేశాయి. కిట్టూ విస్సాప్రగడ సాహిత్యం ఎంతో క్యాచీగా ఉంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top