'96' దర్శకుడితో కార్తీ మూవీ.. మళ్లీ అలాంటి కాన్సెప్ట్ | Sakshi
Sakshi News home page

Karthi: కార్తీ కొత్త సినిమా.. ఫస్ట్ లుక్ చూశారా?

Published Sun, May 26 2024 12:24 PM

Karthi's New Movie With Prem Kumar Titled Meiyazhagan

సూర్య తమ్ముడిగా పరిచయమైనప్పటికీ తనదైన యాక్టింగ్‌తో తెలుగులోనూ అద్భుతమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు కార్తీ. వరస సినిమాలతో అలరించే ఇతడు ప్రస్తుతం రెండు మూవీస్ చేస్తున్నాడు. తాజాగా ఇతజి పుట్టిన రోజు సందర్భంగా వాటి నుంచి అప్డేట్స్ వచ్చాయి.  కార్తీ-'96' మూవీ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమాకు 'మెయ్యళగన్‌' టైటిల్‌ ఫిక్స్ చేశారు. ఇందులో అరవింద స్వామి ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. సూర్య-జ్యోతిక నిర్మిస్తున్నారు.

(ఇదీ చదవండి: ఆయన దుస్తులు లేకుండానే పక్కన వచ్చి కూర్చుంటాడు: స్టార్‌ హీరోయిన్‌)

ఇక షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకొంటోంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్స్‌లో కార్తీ ఎద్దుతో ముచ్చటిస్తున్నట్లు ఒకటి ఉండగా, కార్తీ-అరవిందస్వామి సైకిల్‌లో వెళుతున్నట్లుగా మరో పోస్టర్ కనిపించింది. ఈ రెండింటిని చూస్తుంటే ఈ పోస్టర్లను చూస్తుంటే 'మెయ్యళగన్‌' గ్రామీణ నేపథ్యంలో సాగే వింటేజ్ మూవీ అనిపిస్తుంది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

Advertisement
 
Advertisement
 
Advertisement