అక్కడ మొదలైంది వేట! | Karthi Japan Telugu Movie Official Trailer Released | Sakshi
Sakshi News home page

అక్కడ మొదలైంది వేట!

Published Mon, Oct 30 2023 12:48 AM | Last Updated on Mon, Oct 30 2023 12:48 AM

Karthi Japan Telugu Movie Official Trailer Released - Sakshi

‘‘ఓపెన్  చేస్తే ఓ పెద్ద సముద్రాన్ని చూపిస్తున్నాం. అందులో ఒక బుల్లి చేప. దాని వయసు పదేళ్లు. ఈ బుల్లి చేప.. అమ్మ చేప కోసం ఓ కన్నం వేసింది. అక్కడ మొదలైంది బుల్లి చేప వేట.. ఎండ్రకాయకో కన్నం, రొయ్యకో కన్నం, మొసలికో కన్నం... కన్నాల మీద కన్నాలేసి ఆ బుల్లి చేప ఓ పెద్ద తిమింగలమైపోయింది’’ అంటూ మొదలైంది ‘జపాన్ ’ సినిమా తెలుగు ట్రైలర్‌. కార్తీ హీరోగా రాజు మురుగన్‌ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌ ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మిస్తున్న చిత్రం ఇది.

అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సునీల్, విజయ్‌ మిల్టన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘జపాన్ ’ సినిమా దీపావళి సందర్భంగా విడుదల కానుంది. కార్తీ కెరీర్‌లో 25వ సినిమా తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ వేడుక చెన్నైలో జరిగింది. తెలుగు వెర్షన్ ను అన్నపూర్ణ స్టూడియోస్‌ విడుదల చేస్తోంది. ట్రైలర్‌ రిలీజ్‌ వేడుకలో హీరోలు సూర్య, విశాల్, ఆర్య, ‘జయం’ రవి, దర్శకులు లోకేశ్‌ కనకరాజ్, పా. రంజిత్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి  సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement