Kareena Kapoor: నా వల్లే భారతీయ రైల్వేస్‌కు ఆదాయం పెరిగింది

Kareena Kapoor Says Indian Railways Income Increased By Geet Role: బాలీవుడ్ దివా కరీనా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందం, అభినయంతో బీటౌన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన బ్యూటీ కరీనా. ఆమెను అభిమానులంతా ముద్దుగా బెబో అని కూడా పిలుచుకుంటారు. కభీ ఖుషీ కభీ ఘమ్, జబ్ వి మెట్, ఉడ్తా పంజాబ్, తషాన్, భజరంగీ భాయిజాన్, 3 ఇడియట్స్, హీరోయిన్ వంటి చిత్రాలతో అలరించింది. సినిమాలకు చాలా దూరంగా ఉన్న ఈ భామ ఇటీవల అమీర్ ఖాన్‌కు జోడీగా లాల్ సింగ్ చద్ధా సినిమాలో నటించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కుదేలైంది. ఇదిలా ఉంటే కరీనా కపూర్ తాజాగా ఓ రియాలిటీ షోలో పాల్గొని ఆసక్తికర విషయాలు తెలిపింది.
బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్, వరుణ్ శర్మ లాయర్లుగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో 'కేస్‌తో బన్ తా హై'. ఈ షోలో పాల్గొన్న జబ్ వి మెట్ సినిమాలోని గీత్ అనే పాత్ర వల్లే రైల్వేస్‌కు ఆదాయం పెరిగిందని తెలిపింది. ''నేను చేసిన గీత్ పాత్ర వల్లే ప్యాంట్స్ అమ్మకాలు, భారతీయ రైల్వేలకు ఆదాయం పెరిగింది'' అని కరీనా కపూర్ చెప్పుకొచ్చింది. కాగా కరీనా కపూర్, షాహిద్ కపూర్ జోడిగా కలిసి నటించిన చిత్రం జబ్ వి మెట్. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గీత్‌గా కరీనా కపూర్ అలరించింది. ఇదిలా ఉంటే కరీనా కపూర్ త్వరలో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. సుజయ్ ఘోష్ డైరెక్షన్‌లో విజయ్ వర్మ, జైదీప్ అహ్లవత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
చదవండి: ప్రభాస్ అంటే చాలా ఇష్టం, మేము ఫ్రెండ్స్ కూడా: పీవీ సింధు
మరిన్ని వార్తలు