రాసుకోండి...‘డెవిల్‌’ బాగుంటుంది: కల్యాణ్‌రామ్‌ | Sakshi
Sakshi News home page

రాసుకోండి...‘డెవిల్‌’ బాగుంటుంది: కల్యాణ్‌రామ్‌

Published Wed, Dec 13 2023 10:40 AM

Kalyan Ram Talk About Devil Movie - Sakshi

‘‘మంచి కథ, విజువల్స్, మ్యూజిక్‌ ఉండి.. దానికి తగ్గ టీమ్‌ వర్క్‌ చేసినప్పుడు ప్రేక్షకులు థియేటర్స్‌కి వద్దన్నా వస్తారని ‘బింబిసార’ సినిమా టైమ్‌లో చెప్పాను. దాన్ని మీరు (ఫ్యాన్స్, ఆడియన్స్‌) నిజం చేశారు. అదే కోవలో ‘డెవిల్‌’ మంచి కథా కథనాలతో వస్తోంది. రాసుకోండి.. సినిమా చాలా బావుంటుంది. ఈ చిత్రం సరికొత్త కథతో ఉంటుంది’’ అని హీరో కల్యాణ్‌ రామ్‌ అన్నారు.

ఆయన హీరోగా, మాళవికా నాయర్, సంయుక్తా మీనన్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘డెవిల్‌’. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను మంగళవారం రిలీజ్‌ చేశారు.

ఈ సందర్భంగా కల్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ– ‘‘ఖర్చుకి వెనకాడకుండా ‘డెవిల్‌’ని రూపొందించిన అభిషేక్‌ నామాగారికి థ్యాంక్స్‌. సినిమా అనేది టీమ్‌ ఎఫర్ట్‌. దాన్ని ప్రేక్షకులు ఆదరిస్తే వచ్చే ఆనందమే వేరు. ‘బింబిసార 2’ను వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా మేలో మొదలుపెడతాం. తమ్ముడు ఎన్టీఆర్‌ ‘దేవర’ సినిమా గ్లింప్స్‌ని త్వరలో రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు. ‘‘డెవిల్‌’ కోసం రెండేళ్ల పాటు కల్యాణ్‌ రామ్‌గారు మరో సినిమా చేయకుండా పని చేశారు. ఇందులో ఆయన యాక్షన్, నటన అదిరిపోతాయి. మా ‘డెవిల్‌’ హిట్‌తో 2023 ముగుస్తుంది’’ అన్నారు అభిషేక్‌ నామా. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement