తమిళ దర్శకుడితో తారక్‌ సినిమా.. కథ ఓకేనా ! | Jr NTR Movie With Vetrimaaran | Sakshi
Sakshi News home page

Jr NTR: తమిళ దర్శకుడితో తారక్‌ సినిమా.. కథ ఓకేనా !

Jun 20 2022 7:20 AM | Updated on Jun 20 2022 7:25 AM

Jr NTR Movie With Vetrimaaran - Sakshi

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇటీవల నటించిన చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. రికార్డు స్టాయిలో కలెక్షన్స్‌ రాబట్టి రూ. 1200 కోట్ల క్లబ్‌లోకి చేరింది.

Jr NTR Movie With Vetrimaaran: జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇటీవల నటించిన చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. రికార్డు స్టాయిలో కలెక్షన్స్‌ రాబట్టి రూ. 1200 కోట్ల క్లబ్‌లోకి చేరింది. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను అందుకున్న ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఆస్వాదిస్తున్నాడు. అలాగే తన తదుపరి చిత్రాలపై ఆచితూచి అడుగు వేస్తున్నాడు. ప్రశాంత్‌ నీల్‌, కొరటాల శివ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. 

మరోపక్క ఎన్టీఆర్, తమిళ దర్శకుడు వెట్రిమారన్‌ కాంబోలో ఓ సినిమా రూపొందనుందనే టాక్‌ గత కొన్నాళ్లుగా వినిపిస్తోంది. అయితే ఇటీవల ఎన్టీఆర్‌ను వెట్రిమారన్‌ కలిసి ఓ కథను వినిపించారనే వార్త ఇప్పుడు మళ్లీ ప్రచారంలోకి వచ్చింది. సూర్య హీరోగా వెట్రిమారన్‌ దర్శకత్వంలో ‘వాడివాసల్‌’ తెరకెక్కుతోంది. సో.. ఇటు ఎన్టీఆర్, అటు వెట్రిమారన్‌ వారి ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో వీరి కాంబినేషన్‌లో సినిమాపై స్పష్టత రావడానికి మరికొంత సమయం వేచిచూడాలి.

చదవండి: 👇
మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్‌ హీరో నరేష్‌ !
సినిమా సెట్‌లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు
వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్‌
చెత్త ఏరిన స్టార్‌ హీరోయిన్‌.. వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement