నటి దారుణ హత్య.. పాయింట్‌ బ్లాంక్‌లో గురిపెట్టి..! | Jharkhand actor Isha Alya allegedly shot dead by snatchers in West Bengal | Sakshi
Sakshi News home page

Isha Alya: నటి దారుణ హత్య.. పాయింట్‌ బ్లాంక్‌లో గురిపెట్టి..!

Dec 28 2022 10:02 PM | Updated on Dec 28 2022 10:11 PM

Jharkhand actor Isha Alya allegedly shot dead by snatchers in West Bengal - Sakshi

జార్ఖండ్‌కు చెందిన నటి ఇషా అల్యా దారుణ హత్యకు గురైంది.  పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో ఆమెను కొందరు దుండగులు ఆమెను కాల్చి చంపారు. జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున  ఇషా ఆలియాను చైన్‌ స్నాచర్లు కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఆమె భర్త ప్రకాష్ కుమార్, మూడేళ్ల కుమార్తెతో కలిసి రాంచీ నుంచి కోల్‌కతాకు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది.

నటి భర్త కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలిలోని సీసీటీవీ ఫుటేజీలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. బాధితురాలిని ఉలుబెరియా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆలియా చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె అసలు పేరు రియా కుమారి అయినప్పటికీ  ఇషా అలియా పేరుతోనే ఫేమస్ అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement