24 ఏళ్లు.. కానీ 23వ బర్త్‌డే చేసుకుంటా : హీరోయిన్‌

Janhvi Kapoor Opens Up On Her Birthday Celebrations - Sakshi

మరో మూడు రోజుల్లో (మార్చి, 6) జాన్వీ కపూర్‌కి 23ఏళ్లు నిండుతాయి. 24లోకి అడుగుపెడతారు. మరి.. వేడుకలు భారీ ఎత్తున ఉంటాయా? అంటే.. ఇంటిపట్టున ఖాళీగా ఉంటే ఉండి ఉంటాయేమో. పుట్టినరోజు నాడు జాన్వీ షూటింగ్‌తో బిజీగా ఉంటారు. ఆ విషయం గురించి జాన్వీ మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం ‘గుడ్‌లక్‌ జెర్రీ’ షూటింగ్‌ చేస్తున్నాను. ఈ లొకేషన్‌లోనే నా బర్త్‌డే జరుగుతుంది. ఈ వేడుకల్లో పాల్గొనడానికి మా నాన్న (నిర్మాత బోనీకపూర్‌) గారు లొకేషన్‌కి వస్తారనుకుంటున్నాను. ఆ విషయం అలా ఉంచితే ఇలా షూటింగ్‌ స్పాట్‌లో బర్త్‌డే చేసుకునే అవకాశం రావడం నాకు మంచి ఫీల్‌ని ఇస్తోంది. పని మధ్యలో వేడుక చేసుకోవడం అంటే ఆ థ్రిల్‌ వేరు’’ అన్నారు.

గత ఏడాది మీ బర్త్‌డే ఎలా జరిగింది? అంటే.. ‘‘2020ని నా జీవితంలోంచి తీసేశాను. గతేడాది కరోనా మనల్ని ఏ వేడుకా చేసుకోనివ్వలేదు. అందుకే ఇప్పుడు నేను 24లోకి అడుగుపెడుతున్నప్పటికీ 23వ బర్త్‌డేని చేసుకుంటాను. కరోనా వల్ల ఓ ఏడాదంతా వేస్ట్‌ అయిపోయింది. ఆరేడు నెలలు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. లాక్‌డౌన్‌ తర్వాత సెప్టెంబర్‌ నుంచి షూటింగ్స్‌లో పాల్గొంటున్నాను’’ అన్నారు. జాన్వీ నటించిన తాజా చిత్రం ‘రూహీ’ ఈ నెల 11న రిలీజ్‌ కానుంది.

చదవండి:
సక్సెస్‌ అయితేనే మాట్లాడతారు: సందీప్‌ కిషన్‌

మా సీఎం అభ్యర్థి కమలహాసన్‌ 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top