Jagapathi Babu Look From Rudrangi: ‘రుద్రంగి’ ఫస్ట్‌లుక్, భీమ్‌రావ్ దొరగా జగపతిబాబు

జగపతిబాబు, ఆశిష్ గాంధీ, విమలా రామన్, మమతా మోహన్‌దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. ‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాలకు రైటర్‌గా చేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రసమయి ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎమ్మెల్యే, కవి, గాయకుడు రసమయి బాలకిషన్ నిర్మించారు.
‘రుద్రంగి’ ఫస్ట్‌లుక్, టైటిల్ మోషన్ పోస్టర్‌ని సోమవారం చిత్రబృందం విడుదల చేసింది. ‘రుద్రంగి నాది.. రుద్రంగి బిలాంగ్స్ టు మీ’ అంటూ జగపతిబాబు చెప్పే డైలాగ్ వినిపిస్తుంది. జాలి, దయ లేని భీమ్ రావ్ దొరగా జగపతిబాబుని పరిచయం చేశారు. ‘‘త్వరలో సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి నాఫల్ రాజా సంగీతం అందిస్తున్నారు.
first innings chusaru, second innings chusaru, third innnings chudabothunaru.. mee #BheemRaoDhora from #Rudrangi movie. pic.twitter.com/NWdYfmbWjR
— Jaggu Bhai (@IamJagguBhai) October 3, 2022