దిల్ రాజు చేతుల మీదుగా ‘ది డీల్’ మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్‌ | The Deal Motion Poster Launched By Dil Raju | Sakshi
Sakshi News home page

దిల్ రాజు చేతుల మీదుగా ‘ది డీల్’ మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్‌

Sep 1 2024 8:14 PM | Updated on Sep 1 2024 8:14 PM

The Deal Motion Poster Launched By Dil Raju

ఈశ్వర్ సినిమాలొ ప్రభాస్ ఫ్రెండ్‌, మూగవాడిగా నటించి తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు హను కోట్ల. ఆ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ తగిన పాత్ర కోసం ఎదురుచూశారు.. ఇప్పుడు  ‘ది డీల్’ అనే  సినిమా ద్వారా హీరో గా పరిచయం కాబోతున్నాడు. సిటడెల్  క్రెయేషన్, డిజిక్విస్ట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఈ సినిమా హీరో, దర్శకుడు డాక్టర్ హను కోట్ల పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా ‘ది డీల్’  మూవీ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.  రెండు బాగాలు గా రాబోతున్న ఈ మూవీ మొదటి భాగం మొత్తం హైదరాబాద్ లో.. కొంత మలేషియాలో చిత్రికరించామని, మలి భాగాన్ని మొత్తం మలేషియలో షూటింగ్ చేసి చిత్రాన్ని కంప్లీట్ చేయనున్నట్లు యూనిట్ సభ్యులు వెల్లడించారు. ఈ చిత్రం మొదటి భాగం దసరాకి విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రంలో హీరోయిన్ లుగా చందన, ధరణి ప్రియా నటించగా రఘు కుంచె, రవి ప్రకాష్, మహేష్ పవన్, గిరి, వెంకట్ గోవాడ, శ్రీవాణి, సుజాత దిక్షిత్, సురభి లలిత ముఖ్య పాత్రలు పోషించారు. 

Advertisement
 
Advertisement
Advertisement