రజనీ వర్సెస్‌ జాకీ

Jackie Shroff to play the villain in Rajinikanth Annaatthe - Sakshi

రజనీకాంత్‌ నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఖుష్భూ, మీనా, నయనతార, కీర్తీ సురేశ్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాలో విలన్‌గా ఎవరు నటిస్తారనే విషయం ఇప్పటివరకూ ప్రకటించలేదు. తాజాగా ఈ సినిమాలో విలన్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ నటిస్తారని తెలిసింది. ఈ ఫ్యామిలీ డ్రామాలో జాకీతో తలపడనున్నారట రజనీకాంత్‌. ఈ ఏడాది చివర్లో చెన్నైలో వేసిన ప్రత్యేక సెట్లో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తారని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం అని చిత్రబృందం తెలిపింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది జరిగేలా కనిపించడం లేదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top