నిజానికి దగ్గరగా... | Jabardast Getup Srinu New Movie Opening | Sakshi
Sakshi News home page

నిజానికి దగ్గరగా...

Nov 24 2020 5:43 AM | Updated on Nov 24 2020 5:43 AM

Jabardast Getup Srinu New Movie Opening - Sakshi

‘గెటప్‌’ శీను, అంకితా కరత్

‘గెటప్‌’ శీను, అంకితా కరత్‌ జంటగా కృష్ణమాచారి దర్శకత్వంలో ప్రశాంత్‌ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘రాజు యాదవ్‌’. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి సాగర్‌ కె. చంద్ర క్లాప్‌ ఇచ్చారు. వేణు ఉడుగుల, సుధాకర్‌ చెరుకూరి, తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ స్క్రిప్ట్‌ను కృష్ణమాచారికి అందించారు. సూడో రియలిజమ్‌ జానర్‌లో ఈ సినిమా ఉంటుందని చిత్రబృందం తెలిపింది. ‘కమర్షియల్‌ హంగులకు దూరంగా, వాస్తవికకు దగ్గరగా మా సినిమా ఉంటుంది’ అన్నారు కృష్ణమాచారి.  ‘డిసెంబర్‌ మొదటి వారంలో చిత్రీకరణ ప్రారంభిస్తాం’ అన్నారు ప్రశాంత్‌ రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement