ట్విటర్‌లో మంచు మనోజ్‌, ఆర్జీవీల మధ్య ఆసక్తికర సంభాషణ | Interesting Tweets Between Ram Gopal Varma And Manchu Manoj In Twitter | Sakshi
Sakshi News home page

MAA Elections 2021: ‘మీరు రింగ్ మాస్టర్ సర్’ మంచు మనోజ్‌ కామెంట్‌పై ఆర్జీవీ స్పందన

Oct 25 2021 4:15 PM | Updated on Oct 25 2021 7:15 PM

Interesting Tweets Between Ram Gopal Varma And Manchu Manoj In Twitter - Sakshi

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు ముగిసి రెండు వారాలు గడిచింది. ఈ ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించి ‘మా’ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి వివాదాలు, విమర్శలు, ఆరోపణలతో ‘మా’ ఎన్నికలు వాడివేడిగా సాగాయి. ఇరూ ప్యానల్ల సభ్యులు ఒకరిపై ఒకరూ చేసుకున్న విమర్శ వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

చదవండి: ‘మా’పై ఆర్జీవీ షాకింగ్‌ ట్వీట్‌.. దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన మంచు మనోజ్‌

ఈ క్రమంలో వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్పందిస్తూ తనదైన శైలిలో స్పందించారు. ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఓ సర్కస్ అని, అందులో ఉండే సభ్యులంతా జోకర్లు’ అంటూ వర్మ ట్వీట్ చేయగా.. దానికి మంచు మనోజ్‌.. ‘మా ఒక సర్కస్ అయితే… మీరు రింగ్ మాస్టర్ సర్’ అంటూ తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు. దీంతో ఈ ట్వీట్‌ నెట్టింట తెగ వైరల్‌ అయింది. అయితే ఇది జరిగిన పది రోజులకు తాజాగా వర్మ.. మనోజ్‌ కౌంటర్‌పై స్పందించారు. మనోజ్‌ కామెంట్‌కు రీట్వీట్‌ చేస్తూ.. ‘నేను రింగ్‌ మాస్టర్‌ కాదు. సర్కస్‌లో అందరికి వినోదం పంచే కోతిని మాత్రమే’ అని రిప్లై ఇచ్చాడు.

చదవండి: పెళ్లిలో క‌లిసిన‌ మెగా బ్రదర్స్‌.. నవ్వుతున్న ఫోటోలు వైరల్‌

దీనిపై మనోజ్‌ స్పందిస్తూ.. ‘మనం అందరం ఒకటే సర్‌, సేమ్‌ సర్కస్‌కు చెందిన వాళ్లమే’ అంటూ సమాధానం ఇచ్చాడు. దీనికి ఆర్జీవీ మరో ట్వీట్‌ చేస్తూ.. ‘హే మనోజ్‌ మీ డీపీ స్టేటస్‌ కంటే ‘మా’ ఇంక గొప్పదని అనుకుంటున్నాను’ అంటూ రిప్లై ఇవ్వగా దీనికి మనోజ్‌ రిప్లై ఇచ్చాడు. మీరు చెప్పంది కరెక్ట్‌ సర్‌’ అంటూ రీట్వీట్‌ చేశాడు. ఆ తర్వాత ఆర్జీవీ ‘అవును’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఇలా ట్విటర్‌ వేదికగా వర్మ, మనోజ్‌ల మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. వారి ట్వీట్స్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement