ఈ ఏడాది ముగింపులో మా సినిమా ఓ స్వీట్‌

Hero Nani Talks On Hi Nanna Movie Press Meet - Sakshi

– నాని

‘‘హాయ్‌ నాన్న’ చిత్రంలో వినోదం, అన్ని రకాల భావోద్వేగాలున్నాయి. ఈ చిత్రకథపై ఉన్న కాన్ఫిడెన్స్‌తో కచ్చితంగా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని హీరో నాని అన్నారు. శౌర్యువ్‌ దర్శకత్వంలో నాని, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలో నటించిన చిత్రం ‘హాయ్‌ నాన్న’. మోహన్‌ చెరుకూరి, డా. విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాని విలేకరులతో పంచుకున్న విశేషాలు.

► ‘హాయ్‌ నాన్న’ కథని శౌర్యువ్‌ చెప్పినప్పుడే చాలా హై ఇచ్చింది. యాక్షన్‌ సినిమాల్లో ఒక రకమైన ఎనర్జీ ఉంటుంది. ‘యానిమల్‌’తో సహా ఈ ఏడాది వచ్చిన చాలా యాక్షన్‌ సినిమాలు కావాల్సిన దానికంటే ఎక్కువగానే స్పైస్‌ని పంచాయి. అయితే స్పైసీ తర్వాత ఉండే ఆ స్వీట్‌ని మా సినిమా ఇస్తుంది. ఈ ఏడాది అన్ని ఐటమ్స్‌ పెట్టారు కానీ, ముగించే ఐటమ్‌ నేను పెడతాను (నవ్వుతూ). ‘జెర్సీ’ చూసి బయటికి వచ్చినప్పుడు ప్రేక్షకుల్లో ఒక రకమైన భావోద్వేగం ఉంటుంది. కానీ, ‘హాయ్‌ నాన్న’ చూసి, ప్రేక్షకులు హ్యాపీగా నవ్వుతూ బయటికి వస్తారు. ఈ ఆనందంలోనే మనసుని హత్తుకునే భావోద్వేగాలు ఉంటాయి.
►నాకు కంఫర్ట్‌ జోన్‌ అనేది ఏదీ లేదు. కామెడీ సినిమాలు చేసినప్పుడు అది నా కంఫర్ట్‌ జోన్‌ అన్నారు. తర్వాత ‘జెర్సీ’ చేసినప్పుడు ఎమోషన్‌ నా కంఫర్ట్‌ జోన్‌ అన్నారు. ఆ తర్వాత ‘దసరా’ లాంటి రా మూవీ చేశాను. నాకు కంఫర్ట్‌ జోన్‌ అనేది లేకుండా సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అలాగే నేను ఇమేజ్‌ కోణంలో చూడను. కథ నచ్చిందనే ‘దసరా’ చేశాను.. ఇప్పుడు ‘హాయ్‌ నాన్న’ చేశాను. ఇది అందరికీ కనెక్ట్‌ అయ్యే సినిమాగా నిలుస్తుంది.
►ఇలాంటి ఓ మంచి సినిమాని ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లాలనే ప్రమోషన్స్‌ ఎక్కువగా చేశాం. అందులో భాగంగానే వెంకటేశ్‌గారిని ఇంటర్వ్యూ చేశా. ప్రమోషన్స్‌లో భాగంగానే హీరో శివరాజ్‌ కుమార్‌గారిని కలిశా. వెంకటేశ్‌గారు ‘నా తర్వాత ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులు నిన్ను చూస్తారు’ అన్నారు. మనల్ని ఎవరైనా ఫ్యామిలీ హీరో అన్నప్పుడు హ్యాపీగా ఉంటుంది.   
►వైర ఎంటర్‌టైన్‌మెంట్‌కి ‘హాయ్‌ నాన్న’ తొలి చిత్రం. మోహన్‌ చెరుకూరి, విజయేందర్‌ రెడ్డిగార్లు ΄్యాషనేట్‌ ్ర΄÷డ్యూసర్లు. ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ ఓ పాటలో మాత్రమే కనిపిస్తారు. ►నా ‘దసరా’ సినిమా దాదాపు రూ. 120 కోట్లు వసూలు చేసింది. నా తర్వాతి చిత్రాలు కూడా అదే స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టాలని ఆలోచిస్తూ కూర్చుంటే ఎక్కువ సినిమాలు చేయలేను.
►‘యానిమల్‌’ లాంటి కథ వస్తే చేస్తాను. ‘దసరా’ చిత్రంలో నేను చేసిన పాత్రని ఎవరైనా ముందుగా ఊహించారా? చేశాకే బాగుందన్నారు. సవాల్‌తో కూడుకున్న పాత్రలు, కథలు వచ్చినప్పుడు చేయడానికే ఇష్టపడతాను. నాతో పని చేయాలని ‘బలగం’ వేణు అనుకుంటున్నారని ‘దిల్‌’ రాజుగారు చె΄్పారు. వేణు వచ్చి నాకు కథ చెబితే తప్పకుండా చేస్తాను. ప్రస్తుతం ‘సరి΄ోదా శనివారం’ సినిమా చేస్తున్నాను. ‘హిట్‌ 3’ మూవీ స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. పూర్తయిన వెంటనే షూటింగ్‌ మొదలుపెట్టేస్తాం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top