Jr NTR Hand Injury: Has Jr NTR Fractured His Right Hand, Here Are Full Information In Telugu - Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ చేతికి గాయం.. సర్జరీ.. వాస్తవం ఏంటంటే?

Nov 5 2021 12:19 PM | Updated on Nov 5 2021 1:06 PM

Has Jr NTR fractured His Right Hand, Here What Happened - Sakshi

అయితే ఈ ఫోటోను కొంచెం పరీక్షించి చూస్తే ఎన్టీఆర్  కుడి చేతికి బ్యాండేజి ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో ఎన్టీఆర్‌ చేతికి ఫ్రాక్చర్‌ అయ్యిందా అంటూ ఫాన్స్‌ కంగారు పడుతున్నారు. ఈ క్రమంలో నటుడి వేలికి గాయం అయిందని, దీంతో ఎన్టీఆర్‌ సర్జరీ కూడా చేయించుకన్నట్లు రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

దీపావళి పండుగ సందర్భంగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తన కొడుకులతో కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అభయ్ రామ్, భార్గవ్ రామ్ మధ్య ఎన్టీఆర్‌ సాంప్రదాయ దుస్తులతో కనిపిస్తున్న ఈ ఫోటో అభిమానులను ఎంతగానో అట్రాక్ట్‌ చేస్తుంది. అయితే ఈ ఫోటోను కొంచెం పరీక్షించి చూస్తే ఎన్టీఆర్  కుడి చేతికి బ్యాండేజి ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో ఎన్టీఆర్‌ చేతికి ఫ్రాక్చర్‌ అయ్యిందా అంటూ ఫాన్స్‌ కంగారు పడుతున్నారు. ఈ క్రమంలో నటుడి వేలికి గాయం అయిందని, దీంతో ఎన్టీఆర్‌ సర్జరీ కూడా చేయించుకన్నట్లు రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
చదవండి: దీపావళి సర్‌ప్రైజ్‌: తనయులతో జూ. ఎన్టీఆర్‌, ఫొటో వైరల్‌

అయితే ఈ విషయం మీద ఆరా తీయగా.. ఎన్టీఆర్ చేతికి గాయం అయిన విషయం నిజమేనని తెలుస్తోంది. జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో తారక్‌ చేతి వేలికి గాయమవ్వగా.. ఆసుపత్రిలో చిన్న సర్జరీ కూడా చేయించుకున్నారని సమాచారం. అయితే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదని, ప్రస్తుతం ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎన్టీఆర్‌ విశ్రాంతి తీసుకుంటున్నట్లు వినికిడి. 
చదవండి: ఆచార్య: ‘నీలాంబరి’ ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌ వచ్చేసింది

ఇదిలా ఉండగా తారక్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ, ఎవరు మీలో కోటిశ్వరుడు ప్రోగ్రాంతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఆయన కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చే ఓ సినిమాలో నటించనున్నాడు. దీంతో పాటు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో మరో సినిమాకు సంతకం చేశాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement