Aaradugula Bullet Movie: ఆకట్టుకుంటున్న‘ఆరడుగుల బుల్లెట్’ మూవీ ట్రైలర్

Aaradugula Bullet Movie Trailer Is Out: గోపీచంద్, నయనతార జంటగా నటించిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’.బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. కామెడితో పాటు యాక్షన్ సీన్స్‌తో ట్రైలర్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించారు.'పరిచయం అయితే నేను మర్చిపోను. పంగా అయితే నువ్వు మర్చిపోలేవు, ‘డబ్బులిచ్చే నాన్నను చూసి ఉంటావు… అప్పులిచ్చే నాన్నను ఎక్కడైనా చూశావా?' వంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్8న ప్రేక్షకుల ముందుకు రానుంది. జయబాలజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిలెట్ పతాకంపై తాండ్ర రమేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం కీలకపాత్రలు పోషించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు.