గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది.. భ‌య‌పెడుతోన్న టీజ‌ర్‌ | Sakshi
Sakshi News home page

Geethanjali Malli Vachindi: గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది.. టీజ‌ర్ చూశారా?

Published Sat, Feb 24 2024 9:37 PM

Geethanjali Malli Vachindi Teaser Out Now - Sakshi

ర‌ర్ సినిమాల‌కు ఎప్పుడూ మంచి గిరాకీయే ఉంటుంది. ఇక్క‌డ ఎవ‌రు న‌టించారు? ఎవ‌రు డైరెక్ట్ చేశారు? అనేదానిక‌న్నా క‌థేంటి?  కాన్సేప్ట్ ఏంటి? అనే చూస్తారు ప్రేక్ష‌కులు. అలాంటిది ఆల్‌రెడీ హిట్ కొట్టిన హార‌ర్ మూవీ గీతాంజ‌లికి సీక్వెల్ తెర‌కెక్కుతోంది. దీంతో అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మూవీ గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది.

ఇది అంజ‌లి కెరీర్‌లో 50వ చిత్రంగా తెర‌కెక్కింది. శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీని ర‌చయిత–నిర్మాత కోన వెంకట్‌ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మించారు. శ్రీనివాస్‌ రెడ్డి, ‘సత్యం’ రాజేశ్, ‘షకలక’ శంకర్, అలీ, సునీల్, సత్య ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. మొద‌ట టీజ‌ర్ లాంచ్ ఈవెంట్‌ను స్మ‌శాన‌వాటిక‌లో చేద్దామ‌నుకున్నారు. త‌ర్వాత ఆ ఆలోచ‌న‌ను విర‌మించుకున్నారు.

హైద‌రాబాద్‌లోని ఓ క‌న్వెన్ష‌న్ హాల్‌లో శ‌నివారం సాయంత్రం టీజ‌ర్ లాంచ్ చేశారు. అంజ‌లి క్లాసిక‌ల్ డ్యాన్స్‌తో టీజ‌ర్ మొద‌లైంది. దెయ్యాల‌ను ఎలా న‌మ్మారు? అనే ద‌గ్గ‌రి నుంచి దెయ్యాల‌కు జ‌డుసుకునేవ‌ర‌కు చూపించారు.హార‌ర్‌తో పాటు కామెడీ కూడా పుష్క‌లంగా ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇక‌ ఈ సినిమాను మార్చి 22న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

చ‌ద‌వండి: మీమ‌ర్ పిచ్చి ప్ర‌శ్న‌లు.. హీరో వ‌ద్ద‌ని వారిస్తున్నా ప‌దేప‌దే..

 
Advertisement
 
Advertisement