Sai Pallavi: ఓటీటీలోకి సాయి పల్లవి ‘గార్గి’, ఎప్పుడు?.. ఎక్కడ?

Gargi Movie OTT Release Date Out - Sakshi

సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గార్గి’. జులై 15న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం విమర్శల ప్రశంసలు అందుకుంది. కోర్టు డ్రామా నేపథ్యంలో సాగే ఈ కథను దర్శకుడు గౌతమ్ రామచంద్రన్  అద్భుతంగా తెరకెక్కించాడు. అయితే దర్శకుడి టేకింగ్‌కి, , సాయి పల్లవి నటనకు ప్రేక్షకులు ఫిదా అయినప్పటికీ.. కమర్షియల్‌గా మాత్రం ఈ చిత్రం నిర్మాతలకు నిరాశే మిగిల్చింది. దీంతో ఈ చిత్రం విడుదలై నెల రోజులు కూడా పూర్తి కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆగస్ట్‌ 12 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ‘సోనీలీవ్‌’లో గార్గి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియోని విడుదల చేసింది.

(చదవండి: వరుస ఫ్లాపులు.. సాయిపల్లవి షాకింగ్‌ నిర్ణయం!)

‘గార్గి’ కథేంటంటే.. 
గార్గి(సాయి పల్లవి) ఓ ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌. ఆమె తండ్రి బ్రహ్మానందం(ఆర్‌.ఎస్‌ శివాజీ) హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుంటాడు. ఓ రోజు బ్రహానందం పనిచేసే అపార్ట్‌మెంట్‌లో ఓ చిన్నారిపై అత్యాచారం జరుగుతుంది. ఈ గ్యాంగ్‌ రేప్‌ కేసులో బ్రహ్మానందం అరెస్ట్‌ అవుతారు. తన తండ్రి ఎలాంటి తప్పు చేయడని బలంగా నమ్మిన గార్గి..అతన్ని నిర్ధోషిగా బయటకు తీసుకొచ్చేందుకు ​న్యాయ పోరాటానికి దిగుతుంది.

తండ్రి తరపున వాదించడానికి ఏ లాయర్‌ ముందుకు రాని సమక్షంలో  జునియర్‌ లాయర్‌ గిరీశం(కాళీ వెంకట్‌) గార్గికి మద్దతుగా నిలుస్తాడు. బ్రహ్మానందం తరపున వాదించడానికి ముందుకొస్తాడు. ఆ సమయంలో గార్గి ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? సమాజం ఆమెను, ఆమె కుటుంబాన్ని ఎలా చూసింది? బ్రహ్మానందాన్ని బయటకు తీసుకొచ్చేందుకు లాయర్‌ గిరీశం చేసిన ప్రయత్నం ఏంటి? చివరకు తన తండ్రిని గార్గి నిర్ధొషిగా బయటకు తీసుకొచ్చిందా? లేదా? అనేదే మిగతా కథ.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top