ట్రంప్ మీద రివేంజ్ ఏంట్రా? ఫన్నీగా ట్రైలర్ | Gaaya Padda Simham Movie Trailer | Sakshi
Sakshi News home page

Triler: తరుణ్ భాస్కర్-జేడీ చక్రవర్తి సినిమా ట్రైలర్ రిలీజ్

Apr 25 2026 9:00 PM | Updated on Apr 26 2026 11:44 AM

Gaaya Padda Simham Movie Trailer

ఈ నగరానికి ఏమైంది, పెళ్లి చూపులు సినిమాలతో దర్శకుడిగా ఆకట్టుకున్న తరుణ్ భాస్కర్.. చాన్నాళ్ల నుంచి నటుడిగానే కనిపిస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో 'ఓం శాంతి శాంతి శాంతిః' మూవీతో వచ్చాడు గానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మరో మూవీతో వచ్చేశాడు. అదే 'గాయపడ్డ సింహం'. మే 01న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: తగ్గిపోయిన సినిమాల 'లైఫ్'.. ఎవరు దీనికి కారణం?)

ట్రైలర్ విషయానికొస్తే.. అమెరికా వెళ్లి సెటిలైపోవాలని ఆశపడ్డ హీరోని ట్రంప్, తిరిగి స్వదేశానికి పంపిస్తాడు. దీంతో ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఫిక్సవుతాడు. ఈ క్రమంలోనే ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? జేడీ చక్రవర్తి తదితరుల పాత్రలేంటి అనేది మిగతా స్టోరీలా అనిపిస్తుంది. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగ నటించగా.. హీరో శ్రీ విష్ణు అతిథి పాత్రలో కనిపించనున్నాడు.

ట్రైలర్ అయితే కామెడీ, థ్రిల్లింగ్‌గా బాగానే ఉంది. కానీ ఐపీఎల్, వేసవిని తట్టుకుని ఈ సినిమా ఎంతవరకు నిలబడుతుందో చూడాలి? దీంతో పాటు మే 01న కమెడియన్ సత్య హీరోగా చేసిన 'జెట్ లీ', ధనుష్ 'కర' చిత్రాలు కూడా థియేటర్లలోకి రానున్నాయి.

(ఇదీ చదవండి: చిరంజీవికి కావాలి ఓ నిర్మాత?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement