F3 Movie Pooja Hegde Song Promo: పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ ప్రొమో రిలీజ్.. పూర్తి అప్పుడే..

F3 Movie: Pooja Hegde Party Song Of The Year Promo Released: విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా మరోసారి సందడి చేయనున్న చిత్రం 'ఎఫ్ 3'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ 'ఎఫ్ 2' చిత్రానికి సీక్వెల్ అని తెలిసిన సంగతే. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించిన 'ఎఫ్ 3' మే 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవేకాకుండా అంతకుముందు రిలీజైన రెండు సింగిల్స్ ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు తాజాగా మూడో సింగిల్‌ను విడుదల చేయనున్నారు.
'లైఫ్ అంటే ఇట్టా ఉండాలా' అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను మే 17న రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రొమోను సోమవారం (మే 16) బయటకు వదిలారు. ఇందులో స్పెషల్ అట్రాక్షన్‌గా బుట్టబొమ్మ పూజా హెగ్డే నిలవనుంది. మోస్ట్ గ్లామరస్‌గా ఉన్న పూజా హెగ్డే పోస్టర్‌ను 'పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్'గా రిలీజ్ చేశారు. ఈ పార్టీ నంబర్ సాంగ్‌ను కాసర్ల శ్యామ్ రచించగా, రాహుల్ సిప్లిగంజ్, గీతా మాధురి ఆలపించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
చదవండి: ఈ వారం థియేటర్లలో సందడి చేసే సినిమాలు..
మా సభ్యుల ఆరోగ్యం, సంక్షేమం తొలి ప్రాధాన్యత: మంచు విష్ణు