బాలీవుడ్ హీరోయిన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ | Esha Deol Instagram Account Hacked | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ హీరోయిన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్

Jan 10 2021 7:08 PM | Updated on Jan 10 2021 7:59 PM

Esha Deol Instagram Account Hacked - Sakshi

ముంబయి: సెలెబ్రిటీలు, హీరోలు, హీరోయిన్‌లు ఇలా చాలా మంది సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటారు. తమకు సంబందించిన ప్రతి విషయాన్నిసోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటారు. ఒక్కోసారి సాధారణ ప్రజలతో పాటు సెలెబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లు కూడా హ్యాకింగ్ కి గురి అవుతూ ఉంటాయి. చాలా మంది సెలెబ్రిటీలు కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ఇషా డియోల్ యొక్క ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ అయినట్లు తన ట్విటర్ లో పేర్కొంది. తన అభిమానులు ఎవరు కూడా నా ప్రొఫైల్ నుంచి ఎలాంటి మెసేజ్‌లు, పోస్ట్‌లు వ‌చ్చిన స్పందించవద్దు అని అప్రమత్తం చేసింది. అంతే కాకుండా పలు స్క్రీన్ షాట్ లను తన ట్విటర్ లో షేర్ చేసుకుంది. ఇటీవల కాలంలో ఆశా భోంస్లే, ఊర్మిళ మాటోండ్కర్, సుస్సాన్ ఖాన్, విక్రమంత్ మాస్సే, ఫరా ఖాన్ వంటి ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాల హ్యాక్ విషయం మనకు తెలిసిందే.(చదవండి: టాలీవుడ్ హీరోపై కేసు నమోదు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement