సల్మాన్‌ బాడీగార్డ్‌ జీతం ఎంతో తెలుసా..

Do You Know Salman Khan Bodyguard Shera Salary - Sakshi

సాధారణంగానే సెలబ్రిటీలకు జనాల్లో పిచ్చి క్రేజ్‌ ఉంటుంది. వాళ్లు ఏం చేసినా అభిమానులకు అది విశేషమే. అన్ని విషయాల్లోనూ స్టార్స్‌ను అనుకరిస్తుంటారు. ఇక వీళ్లు ప్రజల్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా బాడీగార్డ్స్‌ ఉండాల్సిందే. లేదంటే మీడియా ఫాలోయింగ్‌, అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. దాదాపు అందరూ సెలబ్రిటీలకు వ్యక్తిగతంగా బాడీగార్డ్స్‌ ఉంటారు. అయితే వీరి గురించి ఎక్కువగా ఎవరికి పరిచయం ఉండదు. కానీ బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ బాడీగార్డ్‌ గురించి అందరికి తెలుసు. సల్లు భాయ్‌ బాడీగార్డ్‌ షెరా.

ఇతను సెలబ్రిటీకి తక్కువేం కాదు. ఇటీవల భారత్‌కు వచ్చిన జస్టిన్‌ బీబర్‌కి బాడీగార్డ్‌గా వ్యవహరించిన షెరా తాజాగా మరోసారి వార్తలోకెక్కాడు. కేవలం సల్మాన్‌కు కాకుండా ముంబైకు విచ్చేసిన ఎంతో మంది అంతర్జాతీయ ప్రముఖలు.. విల్‌ స్మిత్‌, జాకీచాన్‌, మైకేల్‌ జాక్సన్‌ వంటి వారికి గార్డ్‌గా ఉన్నాడు. షెరా బాలీవుడ్‌ ఫెవరేట్‌ బాడీగార్డ్‌. ఇక సల్మాన్‌తో కలిసి 26 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. ఈ క్రమంలో సల్మాన్‌కు భద్రతగా ఉన్న షెరాకు నెలకు 15 లక్షల వరకు జీతం ఉన్నట్లు సమాచారం. అంటే సంవత్సరానికి రెండు కోట్ల వరకు ఉంటుందన్నమాట.

చదవండి: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు కరోనా

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top