
హెబ్బా పటేల్, సుమన్, శ్రావణ్, శ్రీధర్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘శక్తిమతి’. డి. రామకృష్ణ దర్శకత్వంలో హనీ బన్నీ క్రియేషన్స్ పతాకంపై వెంకటేశ్ గౌడ్ నిర్మించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను డైరెక్టర్ వీవీ వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా డి. రామకృష్ణ మాట్లాడుతూ– ‘‘మా గురువు వినాయక్‌గారి చేతుల మీదుగా ‘శక్తిమతి’ మోషన్‌పోస్టర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది.
ఈ చిత్రంలో దాదాపు 30 నిమిషాలు వీఎఫ్‌ఎక్స్ ఉన్నాయి. దాని వల్లపోస్ట్‌ప్రోడక్షన్‌కు చాలా టైమ్ పట్టింది. ఆగస్టులో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’’ అన్నారు. వెంకటేశ్ గౌడ్ మాట్లాడుతూ– ‘‘మా డైరెక్టర్ రామకృష్ణగారు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా తీశాను. నేటితరం వాళ్లు తప్ప కుండా చూడాల్సిన చిత్రమిది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్: పి. రమణా రెడ్డి, సంగీతం: భీమ్స్, కెమేరా: కె. చిట్టిబాబు.